News August 11, 2025

విజయవాడ: కుళ్లిన స్థితిలో వ్యక్తి మృతదేహం.. జిమ్ కోచ్‌గా గుర్తింపు

image

సింగ్ నగర్‌లోని ఓ ఇంట్లో జిమ్ కోచ్ రవిచంద్ర (28) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు వెళ్లి చూడగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహం లభ్యమైంది. నాలుగైదు రోజుల క్రితమే చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News April 18, 2026

2028లోనే TG అసెంబ్లీ ఎన్నికలు?

image

పునర్విభజనతో ముడిపడిన మహిళా రిజర్వేషన్ బిల్లు నిన్న LSలో వీగిపోవడంతో కేంద్రం 2029లో చేపట్టాలనుకున్న జమిలి ఎన్నికలూ అసాధ్యమేనని రాజకీయ వర్గాలంటున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి, తర్వాత జమిలికి వెళ్లాలని మోదీ ప్రభుత్వం భావించిందని చెబుతున్నారు. కానీ డీలిమిటేషన్ కుదరకపోవడంతో దీనికి వెళ్లకపోవచ్చని అంటున్నారు. అలా అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు యథాతథంగా 2028లోనే జరగనున్నాయి.

News April 18, 2026

నేడు 2 మ్యాచులు.. SRHపై ధోనీ ఆడతారా?

image

IPLలో ఇవాళ డబుల్ ధమాకా ఉండనుంది. 3.30PMకు ఢిల్లీ, బెంగళూరు తలపడనున్నాయి. ఆడిన 5 మ్యాచుల్లో 4 గెలిచి RCB జోరు మీద ఉండగా, చివరి 2 మ్యాచుల్లో ఓడి DC కష్టాల్లో ఉంది. మరోవైపు 7.30PMకు SRH, CSK మధ్య కీలక పోరు జరగనుంది. ఈ సీజన్లో ఇరుజట్లూ చెరో 2 గెలిచి, 3 ఓడాయి. అయితే వరుసగా 2 మ్యాచుల్లో గెలవడం, ధోనీ ఆడే అవకాశం ఉండటం చెన్నైకి కలిసొచ్చే అంశం. మరోవైపు SRH బ్యాటింగ్‌లో అదరగొడుతున్నా బౌలింగ్‌లో తేలిపోతోంది.

News April 18, 2026

దోమకొండ: పురాతన మహాదేవుని ఆలయాన్ని దర్శించారా?

image

దోమకొండ సంస్థానంలోని కామినేని వంశస్థులు నిర్మించిన మహా దేవుని పురాతన ఆలయం ఎంతో ప్రసిద్ధి. ఈ ఆలయం కాకతీయుల వాస్తుశిల్పిని పోలి ఉంటుంది. దోమకొండ కోట నిర్మాణం జరిగిన సమయంలోనే క్రీ.శ.18వ శతాబ్దంలో నిర్మించారు. గర్భాలయం, నంది విగ్రహం, శిల్పకళ నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు పేరు కలిగిన ఈ ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక ప్రశాంతతకు అనువైన స్థలం.