News August 11, 2025

హార్దిక్‌కు షాక్.. గిల్‌కు ప్రమోషన్!

image

ఆసియా కప్‌లో గిల్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాండ్య స్థానంలో ఈ యంగ్ ప్లేయర్‌ను VCగా నియమిస్తారని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. జట్టు భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆయనకు వైస్ బాధ్యతలు అప్పగిస్తారని చెప్పాయి. ENGతో టెస్టు సిరీస్‌లో గిల్ కెప్టెన్‌గా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. గాయం నుంచి కోలుకుంటున్న T20 కెప్టెన్ సూర్య టోర్నీ ప్రారంభంలోపు ఫిట్ అవుతారని తెలిపాయి.

Similar News

News April 19, 2026

T2OI కెప్టెన్‌గా శ్రేయస్?

image

T2OI కెప్టెన్‌గా సూర్యను తొలగించాలనుకుంటే సెలక్టర్లకు ఫస్ట్ ఆప్షన్ శ్రేయస్ అయ్యరే అని టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. IPLలో శ్రేయస్ నాయకత్వం పట్ల సానుకూలతతోపాటు T20 క్రికెట్‌లో నాలుగో స్థానంలో ఆయన స్థానాన్ని భర్తీ చేసే ప్లేయర్ మరొకరు లేరని పేర్కొంది. పంత్, గిల్ పోటీలో ఉన్నప్పటికీ అయ్యర్ వైపే మొగ్గుచూపుతున్నట్లు రాసుకొచ్చింది. సూర్యకు కెప్టెన్‌గా మంచి మార్కులు ఉన్నా ఆటగాడిగా ఫెయిలవుతున్నారు.

News April 19, 2026

తమిళనాడులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం

image

AP CM చంద్రబాబు తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. NDA అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఈ నెల 20, 21వ తేదీల్లో అక్కడ పర్యటించనున్నారు. కోయంబత్తూరు, హోసూరు, చెన్నై, ఆవడి ప్రాంతాల్లో ప్రచారంలో పాల్గొంటారు. తెలుగు ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాల్లోనే CBN ప్రచారం సాగనుంది. ఈ సందర్భంగా ఆయన బహిరంగ సభలు, రోడ్డు షోలలో పాల్గొననున్నారు. TNలో ఏప్రిల్ 23వ తేదీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

News April 19, 2026

PM మోదీ ప్రోత్సాహం నాకు బలం: పవన్

image

AP: తన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న <<19688324>>PM మోదీకి<<>> Dy.CM పవన్ ధన్యవాదాలు తెలిపారు. ‘నాతో మాట్లాడేందుకు సమయం కేటాయించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు. త్వరగా కోలుకోవాలని మీరు తెలిపిన విషెస్, మీరిచ్చే ప్రోత్సాహం నాకు గొప్ప బలాన్నిస్తాయి. మీ మద్దతు, మార్గదర్శకత్వానికి కృతజ్ఞుడినై ఉంటా’ అని పవన్ ట్వీట్ చేశారు. పవన్ త్వరగా కోలుకోవాలని CM CBN, మంత్రి లోకేశ్, మాజీ సీఎం జగన్, KTR తదితరులు Xలో పోస్టులు పెట్టారు.