News August 11, 2025
మాజీ ఉపరాష్ట్రపతి ఎక్కడంటూ అమిత్ షాకు లేఖ

మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఎక్కడ ఉన్నారో క్లారిటీ ఇవ్వాలని శివసేన MP సంజయ్ రౌత్ హోంమంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు. ‘JUL 21న రాజీనామా చేసినప్పటి నుంచి ధన్‌ఖడ్ గురించి ఎలాంటి సమాచారం లేదు. ఆయన ఆరోగ్యం తదితర పూర్తి వివరాలను నిజాయితీగా వెల్లడించాలి. కొందరు ఎంపీలు సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయాలని నిర్ణయించారు. కానీ ముందు మిమ్మల్ని అడగాలని నేను డిసైడ్ అయ్యా’ అని రాసుకొచ్చారు.
Similar News
News August 11, 2025
పోలింగ్ కేంద్రాల మార్పు: హైకోర్టులో YCP పిటిషన్ రిజెక్ట్

AP: పులివెందుల ZPTC ఉపఎన్నికల్లో పోలింగ్ స్టేషన్ల మార్పుపై వైసీపీ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు హైకోర్టు నిరాకరించింది. ఈ ఎన్నికల్లో ఒక ఊరిలోని 6 పోలింగ్ బూత్‌లను మరో ఊరికి మార్చడంపై వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి పిటిషన్ వేశారు. మరికొన్ని గంటల్లో(రేపు) పోలింగ్ పెట్టుకుని మార్చడం కుదరదన్న ఈసీ న్యాయవాది వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది.
News August 11, 2025
మినిమమ్ బ్యాలెన్స్ బ్యాంకుల ఇష్టం: RBI

బ్యాంక్ అకౌంట్లో కనీస బ్యాలెన్స్ పరిమితిని రూ.50,000 పెంచుతూ ICICI తీసుకున్న <<17349792>>నిర్ణయంపై <<>>విమర్శలొస్తున్న వేళ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. ‘కనీస సగటు బ్యాలెన్స్ ఎంత ఉండాలి అనేది బ్యాంకుల ఇష్టం. కొన్ని బ్యాంకులు రూ.10,000 ఫిక్స్ చేస్తాయి. మరికొన్ని రూ.2,000 ఉంచుతాయి. మరికొన్ని కనీస బ్యాలెన్స్ నిబంధనను ఎత్తివేశాయి. ఇది ఆర్బీఐ నియంత్రణ పరిధిలోకి రాదు’ అని ఆయన వెల్లడించారు.
News August 11, 2025
షూటింగ్‌లు బంద్ చేయడం సరికాదు: కోమటిరెడ్డి

TG: నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ నేతలతో వేర్వేరుగా భేటీ అయిన అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. షూటింగ్‌లు బంద్ చేయడం సరికాదని, పనిచేస్తూనే డిమాండ్లు నెరవేర్చుకోవాలని కార్మికులకు సూచించారు. నిర్మాతలు కూడా కొంచెం వేతనం పెంచాలని, సమస్యను పెద్దది చేయొద్దని కోరారు. రేపు నిర్మాతలు, కార్మికులు సమావేశమై సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. ఈ భేటీకి ఆయన కూడా హాజరయ్యే అవకాశం ఉంది.