News August 11, 2025

బాపట్ల: తిరుపతి-విశాఖపట్నం డబల్ డెక్కర్ రద్దు

image

తిరుపతి-విశాఖపట్నం, విశాఖపట్నం-తిరుపతి మధ్య నడిచే డబల్ డెక్కర్ ఏసీ రైళ్లను (22707/22708) ఈ నెల 13 నుంచి 18 వరకు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. కృష్ణా కెనాల్ నుంచి గూడూరు వరకు మూడో రైల్వేలైన్ నిర్మాణ పనులు జరుగుతుండడంతో రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ మార్పులు గమనించాలని కోరారు.

Similar News

News April 19, 2026

‘ప్రాజెక్ట్ పునర్విక’.. మంత్రి లోకేశ్ కీలక ప్రకటన

image

AP: అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లలకు వైద్య సాయం అందించేందుకు మంత్రి లోకేశ్ ‘ప్రాజెక్ట్ పునర్విక’ను ప్రకటించారు. చిన్నారి <<19682330>>పునర్వికకు<<>> ₹16Cr ఇంజెక్షన్ ఇస్తుండగా చూడటం తన జీవితంలోని భావోద్వేగ క్షణాల్లో ఒకటని Xలో <>పోస్ట్<<>> చేశారు. ‘ఇలా అరుదైన సమస్యలతో బాధపడే పిల్లలు చాలా మంది ఉన్నారు. ఈ వ్యాధులకు చికిత్స సులభతరం అయ్యేలా, ఖర్చులు తగ్గేలా కేంద్రం, ఫార్మా కంపెనీలు, డాక్టర్లతో కలిసి పని చేస్తా’ అని తెలిపారు.

News April 19, 2026

GWL: రైతులకు గుడ్ న్యూస్.. రైతు భరోసా నిధులు విడుదల

image

సీఎం రేవంత్ రెడ్డి భూపాలపల్లి నుంచి బటన్ నొక్కి రైతు భరోసా రెండో విడత నిధులు రేపు విడుదల చేస్తారని గద్వాల జిల్లా వ్యవసాయ అధికారి వీరప్ప ఆదివారం ప్రకటనలో తెలిపారు. రైతు భరోసా నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని రైతు వేదికల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని రైతులందరూ వారి సమీపంలోని రైతు వేదికల వద్దకు చేరుకొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.

News April 19, 2026

ఆహారాన్ని వేగంగా తింటున్నారా?

image

ఉరుకులు పరుగుల జీవితంలో చాలామందికి తినడానికి టైమ్ దొరకట్లేదు. వేగంగా తినడం వల్ల కడుపు నిండిందనే సిగ్నల్ బ్రెయిన్‌కు వెళ్లడం ఆలస్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఎక్కువగా తినేస్తే బరువు పెరిగే అవకాశం ఉందంటున్నారు. ‘ఆహారాన్ని సరిగ్గా నమలకపోవడం వల్ల జీర్ణసమస్యలు వస్తాయి. ఇలాగే ఎక్కువ రోజులు కొనసాగితే కొవ్వు పేరుకుపోయి గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి సమస్యలు వస్తాయి’ అని పేర్కొంటున్నారు.