News August 11, 2025
గద్వాల జిల్లాలో వర్షపాతం వివరాలు ఇలా..!

గద్వాల జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం కురిసిన వర్షం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అలంపూర్ మండలంలో అత్యధికంగా 71.9 మిల్లీమీటర్లు, తక్కువగా గద్వాల మండలంలో 5.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కేటీదొడ్డి 7.3, ఇటిక్యాల 28.0, మల్దకల్ 7.6, గట్టు 41.3, అయిజ 19.3, రాజోలి 30.5, వడ్డేపల్లి 40.5, మానవపాడు11.3, ఉండవెల్లి 64.5, ధరూర్‌లో 5.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
Similar News
News April 16, 2026
జనగామ: నకిలీ డాక్టర్ ముఠా అరెస్ట్

జిల్లాలో ఆర్ఎంపీ, పీఎంపీలపై నకిలీ తనిఖీలు నిర్వహిస్తూ డబ్బులు వసూలు చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ జానకిరామిరెడ్డి, ఎస్సై ఊర సృజన్ కుమార్ తెలిపిన వివరాలు.. ఎడెల్లి సంతోశ్ కుమార్ నాయకత్వంలోని ఈ ముఠా ఆర్ఎంపీలను బెదిరించి డబ్బులు వసూలు చేసింది. ఐదుగురిని అరెస్ట్ చేసి నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు పరచగా రిమాండ్‌కు తరలించారు.
News April 16, 2026
కర్నూలు రోడ్డు ప్రమాదంపై ప్రధాని, రాష్ట్రపతి దిగ్భ్రాంతి

కర్నూలులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల పరిహారం ప్రకటించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.
News April 16, 2026
ఉమ్మడి జిల్లాలో జగిత్యాల జిల్లా టాప్

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రంగా పెరుగుతోంది. బుధవారం జగిత్యాల జిల్లా గుల్లకోటలో అత్యధికంగా 43.9℃, ఎండపల్లిలో 43.6℃ ఉష్ణోగ్రత నమోదైంది. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో 43.6, ఏక్లాస్పూర్ 43.5℃, కరీంనగర్ జిల్లా ఆసిఫ్‌నగర్ 43.3, నుస్తులాపూర్ 42.6℃, రాజన్న సిరిసిల్ల జిల్లా మార్తన్‌పేట 42.8, పెద్దూర్లో 42.7℃ ఉష్ణోగ్రత నమోదైంది. తీవ్రమైన ఎండలతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


