News August 11, 2025
దాచేపల్లిలో వసతి గృహ సిబ్బందిపై వేటు

విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు గాను దాచేపల్లి వసతి గృహ సంక్షేమాధికారి దీపికను జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు విధుల నుంచి తొలగించారు. ఆ వసతి గృహంలో పనిచేస్తున్న పొరుగు సేవల వాచ్‌మెన్ సంజేశ్వరరావును తొలగించారు. ఇటీవల జరిగిన ఒక సంఘటనకు బాధ్యులైన విద్యార్థులపై ఎఫ్‌ఐఆర్ నమోదైనందున, వారిని కూడా వసతి గృహం నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News April 17, 2026
మెదక్ జిల్లాకు రెండు డయాలసిస్ కేంద్రాలు

రామాయంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు డయాలసిస్ కేంద్రాన్ని మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 59 ఆస్పత్రుల్లో వీటిని ఏర్పాటు చేయనుండగా.. మెదక్ జిల్లాలోని రామాయంపేట, కౌడిపల్లి కేంద్రాలకు అనుమతులు లభించాయి. త్వరలోనే ఐదు పడకల సామర్థ్యంతో ఈ కేంద్రం అందుబాటులోకి రానుంది. దీంతో కిడ్నీ బాధితులకు స్థానికంగానే ఉచితంగా డయాలసిస్ సేవలు అందనున్నాయి.
News April 17, 2026
విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి: కలెక్టర్ నిషాంతి

విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని అల్లూరి జిల్లా కలెక్టర్ నిషాంతి అన్నారు. ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు శుక్రవారం పాడేరులో రైజింగ్ స్టార్స్ పేరుతో సత్కారించి బహుమతులు అందజేశారు. గిరిజన సంక్షేమ శాఖ కళాశాలల నుంచి ఏడుగురు, KGBV.ల నుంచి నలుగురు, ప్రభుత్వం జూనియర్ కళాశాలల నుంచి నలుగురికి ఈ సత్కారం లభించింది. పలువురు అధికారులు పాల్గొన్నారు.
News April 17, 2026
మెదక్: కార్మికుల కొత్త వేతన ఒప్పందం ఖరారు: CITU

సీఐటీయూ చొరవ, కార్మికుల ఐక్యతతోనే మెరుగైన వేతన ఒప్పందం సాధ్యమైందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ.మల్లేశం అన్నారు. చేగుంట మండలం చిన్నశివనూరు శివారులోని నియాపోలి పరిశ్రమ కార్మికుల వేతన ఒప్పందంపై శుక్రవారం సంగారెడ్డి లేబర్ కమిషనర్ కార్యాలయంలో సంతకాలు పూర్తయ్యాయి. పాత ఒప్పందం మార్చి 31తో ముగియగా, కొత్త ఒప్పందం ద్వారా కార్మికులకు ప్రయోజనం చేకూరనుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.


