News August 11, 2025
అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘కూలీ’ హవా

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌లో అదరగొడుతోంది. ఇండియాలో అన్ని భాషల్లో కలిపి 7లక్షల టికెట్స్ బుకింగ్ అయినట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.70 కోట్లు వచ్చాయని, ఫస్ట్ డే రూ.100 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉంటే ‘వార్-2’ మూవీకి మాత్రం ఇప్పటివరకూ 60వేల టికెట్సే బుక్ అయ్యాయని, ఇవాళ్టి నుంచి పెరిగే ఛాన్స్ ఉందంటున్నాయి.
Similar News
News August 16, 2025
అలా చేస్తే ట్రంప్‌ని నోబెల్‌కి నామినేట్ చేస్తా: హిల్లరీ

ఒక షరతుపై US అధ్యక్షుడు ట్రంప్‌ని నోబెల్ బహుమతికి నామినేట్ చేస్తానని 2016లో ఆయనతో పోటీచేసి ఓడిన హిల్లరీ క్లింటన్ పేర్కొన్నారు. ‘కీవ్ నుంచి ఉక్రెయిన్ కొంచెం కూడా భూభాగాన్ని కోల్పోకుండా, రష్యా-ఉక్రెయిన్ మధ్య ట్రంప్ యుద్ధాన్ని ఆపగలిగితే నేనే స్వయంగా ఆయన్ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తాను’ అని హిల్లరీ క్లింటన్ వ్యాఖ్యానించారు. మరి.. పుతిన్‌ని ట్రంప్ సీజ్‌ఫైర్‌కి ఒప్పిస్తారా? కామెంట్ చేయండి.
News August 16, 2025
TG వాహనాలకు ఇయర్లీ పాస్ ఎప్పుడంటే?

TG: నిన్నటి నుంచి దేశంలో ఫాస్టాగ్ <<17409246>>ఇయర్లీ పాస్<<>> అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ వాహనాలకు మాత్రం ఇంకా పాస్ అందుబాటులోకి రాలేదు. వాహన్ డేటా బేస్‌లో TG వాహనాల వివరాలను మెర్జ్ చేయకపోవడంతో సమస్య తలెత్తింది. కేంద్రం ప్రభుత్వ అధికారులతో రాష్ట్ర ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ సురేంద్ర మోహన్ సంప్రదింపులు జరుపుతున్నారు. ఆగస్టు 20కల్లా రాష్ట్రంలో ఇయర్లీ పాస్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
News August 16, 2025
SSMB29 మూవీపై క్రేజీ అప్డేట్!

మహేశ్‌బాబు-రాజమౌళి కాంబోలో SSMB29 చిత్రం శరవేగంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మహేశ్ బర్త్‌డో రోజు సెట్స్‌లో ప్రియాంకతో ఉన్న ఫొటో తాజాగా వైరలవుతోంది. ఇప్పుడు మరో అప్‌డేట్ కూడా వినిపిస్తోంది. ఇప్పటికే 3 షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్‌లో నైరోబీ, టాంజానియాలో నాలుగో షెడ్యూల్ ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. ప్యాన్ వరల్డ్ రేంజ్‌లో జక్కన్న ఈ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.