News August 11, 2025

KNR: FREE TRAINING.. నేడే లాస్ట్ డేట్

image

KNR బీసీ స్టడీ సర్కిల్లో KNR, JGTL, PDPL జిల్లాల్లో డిగ్రీ పాసైన అభ్యర్థులకు గ్రూప్- 1, 2, 3, 4, RRB, SSC, Bankingకు ఉచిత శిక్షణకు సంబంధించి దరఖాస్తుకు నేడే చివరి తేదీ అని డైరెక్టర్ రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగ అభ్యర్థులు www.tgbcstudycircle.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. శిక్షణ కాలం 150 రోజులు ఉంటుందన్నారు. తరగతులు ఆగస్ట్ 25న ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.

Similar News

News April 17, 2026

ప.గో కలెక్టర్ కీలక ఆదేశాలు

image

పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్స్‌ ద్వారా భూసంబంధిత సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. 2025 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు 13 విడతల్లో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. జిల్లావ్యాప్తంగా అందిన 553 దరఖాస్తుల్లో 189 పరిష్కరించామని, మిగిలిన 229 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో అర్జీల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని ఆమె ఆదేశించారు.

News April 17, 2026

అమలాపురం: కంపెనీల్లో భారీ ఖాళీలు..పది పాసైతే అర్హులు

image

అమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో వికాస ఆధ్వర్యంలో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్ లచ్చారావు ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలకు 15 కంపెనీలు హాజరవ్వగా..మొత్తం 13,00 ఖాళీలను భర్తీ చేయనున్నాయన్నారు. పోస్టుల మేరకు 18-30 ఏళ్లు ఉండి, టెన్త్ ఆపై చదివిన వారు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

News April 17, 2026

హాస్టల్ విద్యార్థులకు నెల్లూరు కలెక్టర్ అభినందనలు

image

సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఉంటూ ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం కలెక్టరేట్‌లో అభినందించారు. 479 మార్కులు సాధించిన కె.గణేష్‌తో పాటు ప్రతిభచూపిన పి.పూజ, బి.పుష్పలత, ఎస్.అనూష, టి.సుమతి, పి.శ్రీవేణుకు ప్రశంసా పత్రాలను అందజేశారు. విద్యార్థులు ఇలాగే కష్టపడి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.