News August 11, 2025

OFFICIAL: ఈ బస్సుల్లో ఉచిత ప్రయాణం లేదు

image

AP: ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే ఉచిత బస్సు ప్రయాణం పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్‌ల్లోనే ఉంటుందని ప్రభుత్వం GO ఇచ్చింది. బాలికలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు ఐడీ కార్డు చూపించి ప్రయాణించవచ్చంది. నాన్‌స్టాప్, ఇతర రాష్ట్రాలకు వెళ్లే, పర్యాటక, సూపర్ లగ్జరీ, సప్తగిరి(తిరుమల), ఆల్ట్రా డీలక్స్, స్టార్ లైనర్, AC బస్సుల్లో స్కీమ్ వర్తించదని తెలిపింది.

Similar News

News August 11, 2025

AP DSC ఫలితాలు విడుదల

image

ఏపీ డీఎస్సీ ఫలితాలు విడుదల అయ్యాయి. అభ్యర్థులు ఇక్కడ <>క్లిక్<<>> చేసి రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం గతంలో 16,347 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా జూన్ 6 నుంచి జులై 2 వరకు పరీక్షలు జరిగాయి. 92.90శాతం మంది హాజరయ్యారు. ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లోనూ ఎగ్జామ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు.

News August 11, 2025

వైభవ్‌ సూర్యవంశీపై BCCI ఫోకస్?

image

సీనియర్లు ఒక్కొక్కరుగా రిటైర్ అవుతుండటంతో పద్నాలుగేళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీపై BCCI ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అతడిని అంతర్జాతీయ స్థాయి క్రికెటర్‌గా తీర్చిదిద్దేందుకు బోర్డు అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో అతడికి NCA స్పెషల్ ట్రైనింగ్ ఇస్తోంది. T20, వన్డేలకు వైభవ్ అటాకింగ్ స్టైల్ చక్కగా సరిపోతుందని భావిస్తోందట. దీర్ఘ దృష్టితో అతడిని ఎంకరేజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

News August 11, 2025

AI భయం.. ఉద్యోగం భద్రమేనా?

image

AI ఎంట్రీతో టెక్ కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగాల కోత విధిస్తుండటంతో తమ జాబ్ ఉంటుందో ఊడుతుందోనని IT ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. గతంలో సాఫ్ట్‌వేర్ అని గర్వంగా చెప్పిన గొంతులు నేడు బొంగురుపోయే పరిస్థితి తలెత్తింది. ప్రాజెక్టులు ఆగిపోవడం, తొలగింపులు పెరగడంతో ఉద్యోగ భద్రత, AI ప్రభావంపై చర్చ మొదలైంది. ఇది తాత్కాలికమా? మళ్లీ పునర్వైభవం వస్తుందా? అంటూ తమ భవిష్యత్తుపై ఉద్యోగులు బెంగపెట్టుకుంటున్నారు.