News August 11, 2025

రంపచోడవరం సబ్ కలెక్టర్‌గా శుభం నొఖ్వాల్ బాధ్యతలు

image

రంపచోడవరం సబ్ కలెక్టర్‌గా శుభం నొఖ్యాల్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2023బ్యాచ్‌కు చెందిన ఈయనకు తోలి పోస్టింగ్‌ను రంపచోడవరానికి నియమించారు. కార్యాలయం సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. పలువురు తహసీల్దార్‌లు మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో రెవెన్యూ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని సబ్ కలెక్టర్ స్పష్టం చేశారు.

Similar News

News April 18, 2026

SRPT: రోడ్డు ప్రమాదంలో VRO మృతి

image

తిరుమలగిరి VRO ముస్తఫా శుక్రవారం రాత్రి దూరాజ్‌పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. తన కుమార్తె వివాహ శుభలేఖలు పంచి కోదాడకు తిరిగి వస్తుండగా, జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టింది. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసే ముస్తఫా మృతితో తోటి ఉద్యోగులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన మరణం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

News April 18, 2026

NMC చేసిన మార్పుల వల్లే పరీక్ష వాయిదా!

image

MBBS పరీక్షల సిలబస్‌లో NMC నిబంధనల ప్రకారం (పాతనిబంధనలు) పేపర్-Iలోని జనరల్ సర్జరీ కింద చేర్చిన కొన్ని అధ్యాయాలు ఇప్పుడు కొత్త నిబంధనల్లో జనరల్ సర్జరీ పేపర్-IIలో చేర్చడం వల్లే ఈనెల 15న జరిగిన <<19670707>>MBBS జనరల్ సర్జరీ పేపర్-1 (రెగ్యులర్) పరీక్ష రద్దు చేసి<<>>, ఈనెల 27కు వాయిదా వేసినట్లు KNRUHS ప్రకటించింది. విద్యార్థుల నుంచి పెద్ద సంఖ్యలో విజ్ఞప్తులు రావడంతో వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు.

News April 18, 2026

ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు.. ప్రతిపక్షాలపై పవన్ విమర్శలు

image

LSలో మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి చట్టసభల్లో మహిళా శక్తిని పెంపొందించే అవకాశాన్ని ప్రతిపక్ష పార్టీలు దూరం చేశాయని AP Dy.CM పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఈ బిల్లును LS ముందుకు తీసుకువచ్చిన ప్రక్రియను జనసేన స్వాగతించినట్టు చెప్పారు. అయితే ప్రతిపక్షాలు కూడా ఆమోదించి ఉంటే వారికీ గౌరవం దక్కేదన్నారు. రానున్న రోజుల్లోనైనా మహిళా శక్తికి చట్టసభల్లో సముచిత స్థానం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.