News March 31, 2024
BREAKING: HYD: ఫ్రెండ్ ఛాతిలో కత్తితో పొడిచారు..!

HYD అత్తాపూర్‌లో స్నేహితుల మధ్య వివాదం చెలరేగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. సయ్యద్ ముస్తఫా అలీ అనే యువకుడిపై అతడి ఫ్రెండ్స్ అమాన్, అఫాన్ కలిసి దాడి చేశారు. బీర్ బాటిల్‌తో తల పగలగొట్టి, అంతటితో ఆగకుండా కత్తితో ఛాతిలో పొడిచి పరారయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వచ్చి బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 19, 2025
OU: ఎంఏ లాంగ్వేజెస్ పరీక్షా ఫలితాలు విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఏ లాంగ్వేజెస్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సుల సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవాలని సూచించారు.
News April 19, 2025
HYD: రివాల్యుయేషన్‌కు దరఖాస్తుల ఆహ్వానం

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంసీఏ కోర్సుల పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎంసీఏ మెయిన్, బ్యాక్ లాగ్ పరీక్షలతో పాటు దూరవిద్య ఎంసీఏ పరీక్ష రివాల్యుయేషన్‌కు ఒక్కో పేపర్‌కు రూ.800 చొప్పున చెల్లించి ఈ నెల 23వ తేదీలోగా టీఎస్ ఆన్లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. రూ.200 అపరాధ రుసుముతో ఈ నెల 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
News April 19, 2025
హైదరాబాద్: సీఎం పర్మిషన్ కోసం వెయిటింగ్

నగరంలో అక్కడక్కడా రోడ్లు దెబ్బతినగా వాటికి మరమ్మతులు చేయాల్సి ఉందని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. ఆ పనుల కోసం టెండర్లు పిలవాల్సి ఉందంటున్నారు. నగరంలో దాదాపు 744 కిలోమీటర్లు రోడ్ల మరమ్మతులకు రూ.2,491 కోట్లు కావాలని అందుకోసం ఇప్పటికే సీఎం కార్యాలయానికి ప్రతిపాదనలు పంపామని చెబుతున్నారు. సీఎం రేవంత్ అనుమతి లభించిన తరువాత పనులు ప్రారంభం అవుతాయని అంటున్నారు.