News August 11, 2025

SRCL: ‘నులిపురుగు నివారణకు మాత్రలు వేసుకోవాలి’

image

నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. సోమవారం జాతీయ నులిపురుగుల నిర్ములన దినోత్సవం సందర్భంగా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. నేడు హాజరుకాని పిల్లలకు 18న గోలీలు పంపిణీ చేస్తామని తెలిపారు.

Similar News

News April 19, 2026

ఒకే వేదికపై ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ

image

జగిత్యాలలో ప్రముఖ చరిత్రకారుడు జైషెట్టి రమణయ్య సంస్మరణ సభలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో MLA సంజయ్ కుమార్, MLC ఎల్ రమణ ఒకే వేదికపై పాల్గొని రమణయ్య చిత్రపటానికి పూలమాలలు అర్పించి నివాళులు అర్పించారు. ప్రస్తుత బీఆర్‌ఎస్-కాంగ్రెస్ రాజకీయ వాతావరణంలో ఈ ఇద్దరు నాయకులు ఒకే వేదికపై కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సంస్మరణ సభ అయినప్పటికీ ఈ దృశ్యం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

News April 19, 2026

ఓదెల మల్లన్న ఆలయంలో భక్తుల సందడి

image

పెద్దపల్లి జిల్లా ఓదెల భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో ఆదివారం భక్తులతో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి బోనాలు, పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయంలోని మదన పోచమ్మ తల్లిని దర్శించుకున్నారు. అటు ఎండ తీవ్రత భారీగా పెరగడంతో ఆలయ చుట్టూ తడకలు వేసి చల్లని వాతావరణాన్ని ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.

News April 19, 2026

జమ్మికుంట మార్కెట్ రేపు పున: ప్రారంభం

image

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌ 3 రోజుల సెలవుల అనంతరం సోమవారం పునః ప్రారంభం కానుంది. శుక్రవారం అమావాస్య సందర్భంగా సెలవు, నిన్న, నేడు సాధారణ సెలవులు కావడంతో మార్కెట్ మూసి ఉంది. దీంతో రేపు మార్కెట్ ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరకులను తీసుకొచ్చి సరసమైన ధరలు పొందాలని అధికారులు సూచించారు. ఉదయం 9 గంటలలోపు మాత్రమే పత్తిని యార్డులోకి అధికారులు అనుమతించనున్నట్లు పేర్కొన్నారు.