News August 11, 2025

ఆగస్టు 15 వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం ప్రగతి మైదానంలో ఆగస్టు 15న జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను, పండుగ వాతావరణంలో అట్టహాసంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. వసతులు సక్రమంగా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Similar News

News April 18, 2026

టెన్త్ ఫలితాలు ఎప్పుడంటే?

image

తెలంగాణ టెన్త్ పరీక్ష పేపర్ల వాల్యుయేషన్ ఈ నెల 23తో ముగించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. తరువాత మార్కుల నమోదు ప్రక్రియకు మరో పది రోజుల సమయం పట్టనుంది. దీంతో మే 4 లేదా 5 తేదీల్లో ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. టీజీలో మొత్తం 5.17 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాశారు.
అలాగే ఏపీలో ఈ నెలాఖరులో వెల్లడించేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు.

News April 18, 2026

గ్రీన్ జెర్సీలో బరిలోకి దిగనున్న RCB

image

IPL-2026లో ఈరోజు RCBతో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. మధ్యాహ్నం 3:30 గంటల నుంచి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ మ్యాచులో ఆర్సీబీ గ్రీన్ కలర్ జెర్సీలో బరిలోకి దిగనుంది. ‘Go Green’ ఇనిషియేటివ్ కింద ఏటా ఒక హోమ్ మ్యాచ్‌లో ఆ జట్టు ప్లేయర్లు గ్రీన్ జెర్సీ ధరిస్తుంటారు. కాగా RCBలో ఈ ట్రెండ్ 2011 నుంచి కొనసాగుతోంది.

News April 18, 2026

భాగ్యనగరానికి తలమానికం.. మన చార్మినార్

image

450 సంవత్సరాల క్రితం నిర్మితమైన సుందరమైన కట్టడం చార్మినార్. భాగ్యనగరానికి ఇది అమూల్యమైన వారసత్వ సంపద. ఈ కట్టడం నాలుగు శతాబ్దాలుగా ఇండో- ఇస్లామిక్ శిల్పకళా వైభవానికి, మతసామరస్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. మన సంస్కృతికి ప్రత్యేకగా నిలిచిన ఈ చారిత్రక వారసత్వ సంపదను కాపాడుకుంటూ భావితరాలకు మన వారసత్వ సంపదను అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. # నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవం.