News August 11, 2025

KCR కీలక సమావేశం

image

TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో KTR, హరీశ్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్‌తో కీలక సమావేశం నిర్వహించారు. ఈ నెల 14న కరీంనగర్‌లో బీఆర్ఎస్ నిర్వహించే బీసీ సభపై సమాలోచనలు చేశారు. భారీగా జనసమీకరణ చేయాలని కేసీఆర్ ఆదేశించారు. అలాగే కాళేశ్వరం కమిషన్ రిపోర్టు, ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్లే విషయంపైనా చర్చించారు.

Similar News

News August 21, 2025

30 రోజులు జైల్లో ఉంటే ఔట్.. మీరేమంటారు?

image

తీవ్ర నేరారోపణలతో 30 రోజులు జైల్లో ఉండే ప్రజాప్రతినిధిని పదవి నుంచి తొలగించే బిల్లును కేంద్రం నిన్న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం <<17462790>>దుమారానికి<<>> దారి తీసింది. ప్రస్తుత కక్షా రాజకీయాల్లో శిక్ష పడకుండానే ఎవరినైనా పదవుల నుంచి తొలగించేందుకు ప్రభుత్వాలు కుట్ర చేస్తాయని ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అటు నేరస్థులకు రాజకీయాల్లో చోటు ఉండొద్దని కేంద్రం వాదిస్తోంది. మరి ఈ బిల్లుపై మీ కామెంట్?

News August 21, 2025

వినాయక చవితికి మండపాలు పెడుతున్నారా?

image

AP: రాష్ట్రంలో వినాయక చవితి సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసుకునేందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని పోలీసు శాఖ తెలిపింది. మండపం కోసం ganeshutsav.netలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అడ్రస్, మండపం ఏర్పాటు చేసే ప్రదేశం, కమిటీ సభ్యుల ఫోన్ నంబర్లు, నిమజ్జనం తేదీ, ఏ వాహనంలో నిమజ్జనం చేస్తారనే విషయాలు పొందుపరచాలి. సైట్ నుంచే నేరుగా NOC డౌన్‌లోడ్ చేసుకుని మండపం ఏర్పాటు చేసుకోవచ్చు.

News August 21, 2025

సిబిల్ స్కోర్ లేకపోతే నో జాబ్.. కేంద్రం క్లారిటీ

image

IBPS సెలక్షన్ ప్రక్రియలో అభ్యర్థులు సిబిల్ స్కోర్ పొందుపరచాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. కానీ బ్యాంకులో ఉద్యోగంలో చేరే సమయంలో క్రెడిట్ స్కోర్ చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సిబిల్ రికార్డు అప్డేటెడ్‌గా లేకుంటే బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ నుంచి NOC తీసుకోవాలని సూచించారు. ఆర్థికపరమైన క్రమశిక్షణ కలిగిన వారినే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని బ్యాంకులు కోరుకుంటున్నట్లు తెలిపారు.