News August 11, 2025

నిర్మల్: ‘అంగన్వాడీ ఆయాలకు ప్రమోషన్లు ఇవ్వాలి’

image

అంగన్వాడీ ఆయాలుగా 5 ఏళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్న వారికి టీచర్స్‌గా ప్రమోషన్‌ ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్‌ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ ఫైజాన్‌ అహ్మద్‌కు అంగన్వాడీ యూనియన్‌ నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. అర్హత ఉన్న ఆయాలకు ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. ఇందులో యూనియన్‌ నాయకులు శైలజ, లావణ్య, రమ్య, భాగ్య, స్వరూప, చందన, లత ఉన్నారు.

Similar News

News April 18, 2026

పెంచలకోన వార్షిక బ్రహ్మోత్సవాల వివరాలు ఇవే…

image

☞ ఏప్రిల్ 28న: ధ్వజారోహణం, శేష వాహ సేవ ☞29న: బంగారు హనుమంత సేవ ☞ 30న: బంగారు గరుడసేవ ☞మే 1న: కళ్యాణోత్సవం, రథోత్సవం ☞2న: వసంతోత్సవం, అశ్వవాహన సేవ ☞3న: గోనుపల్లిలో గ్రామోత్సవం, పల్లకి సేవ.

News April 18, 2026

‘అల్లూరి జిల్లాలో పాఠశాలలకు మౌలిక వసతులు కల్పిస్తాం’

image

ఉమ్మడి అల్లూరి జిల్లాలో అన్ని పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి జరుగుతుందని సర్వశిక్ష జిల్లా అధికారి స్వామి నాయుడు అన్నారు. రంపచోడవరంలో విద్యాశాఖ అధికారులతో శనివారం సమావేశం జరిగింది. జిల్లాలో ఏ పాఠశాలలకు భవనాలు, మరుగుదొడ్లు, నీరు తదితర సదుపాయాలు అవసరమో నివేదిక అందజేయాలని MEO‌లను ఆయన ఆదేశించారు. గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రుక్మాంగదయ్య, ఏజెన్సీ DEO. మల్లేశ్వరావు పాల్గొన్నారు.

News April 18, 2026

చిన్నారి పునర్విక చికిత్సపై TDP స్పష్టత

image

అరుదైన SMA టైప్-1 వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్విక చికిత్సకు మంత్రి నారా లోకేశ్ రూ.6 కోట్లు స్వయంగా అందించిన విషయంపై తప్పుడు ప్రచారం జరుగుతోందని టీడీపీ Xలో ట్వీట్ చేసింది. మొత్తం రూ.16 కోట్ల ఇంజెక్షన్ కోసం దాతలు రూ.10 కోట్లు సమకూర్చగా, మిగతా మొత్తాన్ని లోకేశ్ భరించారని రాసుకొచ్చింది. CMRF నిధులు ఉపయోగించలేదని స్పష్టం చేస్తూ తప్పుడు ప్రచారాన్ని Xలో ఖండించింది.