News August 11, 2025

WNP: పోడు రైతులపై ఫారెస్ట్ అధికారులు పెట్టిన కేసులను ఎత్తివేయాలి

image

పోడు భూముల రైతులపై ఫారెస్ట్ అధికారులు పెట్టిన కేసు ఎత్తివేయాలని కోరుతూ తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో వనపర్తి కలెక్టర్ కార్యాలయం ముందు గిరిజనులు ధర్నా చేపట్టారు. తెలంగాణ సంఘం జిల్లా కార్యదర్శి బాల్య నాయక్ మాట్లాడుతూ.. పోడు భూముల రైతులపై ఫారెస్ట్ అధికారులు పెట్టిన కేసులు ఉపసంహరించకపోతే ఉద్యమం తప్పదన్నారు. కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు, రైతులు గిరిజన మహిళా నాయకులు పాల్గొన్నారు.

Similar News

News April 17, 2026

సింగరేణిపై గల్ఫ్ సెగ.. బొగ్గు ఉత్పత్తికి ఆటంకం

image

గల్ఫ్ యుద్ధ పరిణామాలతో సింగరేణి సంస్థకు ముడిసరుకు కష్టాలు మొదలయ్యాయి. బ్లాస్టింగ్ మెటీరియల్‌, డ్రిల్ రాడ్లు, డిటొనేటర్ల దిగుమతి నిలిచిపోవడంతో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది. అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో, సవరించిన రేట్ల ప్రకారం ఒప్పందాలు చేసుకుంటేనే సరఫరా చేయగలమని కాంట్రాక్టర్లు Way2Newsకు వివరించారు. ఇప్పటికే నష్టాల్లో ఉన్న సంస్థకు, సరుకు సరఫరా నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

IPL టికెట్ల అమ్మకాల్లో గోల్‌మాల్.. ఒక్కోటి రూ.19వేలు

image

IPL టికెట్ల అమ్మకాలలో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో క్యాంటీన్ వర్కర్ చంద్రశేఖర్ 181 టికెట్లను బ్లాక్ మార్కెట్‌లో ఒక్కోటి ₹15K-19Kకు విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ టికెట్లు ఈ నెల 15న జరిగిన RCBvsLSG మ్యాచుకు సంబంధించినవి. KSCA మెంబర్ గణేశ్ పరీక్షిత్ తనకు టికెట్లు ఇచ్చి అధిక ధరలకు అమ్మాలని చెప్పినట్లు అతను వెల్లడించాడు. ప్రస్తుతం గణేశ్ పరారీలో ఉన్నాడు.