News August 11, 2025
ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ సొంత భవనాలు: కోదాడ MLA

అద్దె ఇబ్బంది లేకుండా ప్రభుత్వ కార్యాలయాలకు మెరుగైన వసతులతో భవనాలను నిర్మిస్తామని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ అన్నారు. సోమవారం కోదాడ మండలం రెడ్లకుంటలో ఎంఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి ఆమె మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజలకు ప్రభుత్వ సొంత భవనాల ద్వారా మెరుగైన సదుపాయాలు కలుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఉన్నారు.
Similar News
News April 19, 2026
MGU: పరీక్షల షెడ్యూల్ విడుదల

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో బీటెక్ పరీక్షల షెడ్యూల్‌ను యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. సెమిస్టర్-2, 4 (రెగ్యులర్ & బ్యాక్ లాగ్), సెమిస్టర్-1,3 (బ్యాక్ లాగ్) పరీక్షలు మే-5 నుంచి మే-21 మధ్య జరుగుతాయని పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. టైం టేబుల్స్‌ను అధికారక ఎంజీయూ వెబ్‌సైట్‌లో ఉంచామన్నారు.

వికారాబాద్: ITIలో షార్ట్ టర్మ్ కోర్సులకు ఆహ్వానం

వికారాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ITI/ATCలో 3వ బ్యాచ్‌కు షార్ట్ టర్మ్ టెక్నికల్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానించారు. ఏప్రిల్ 20 నుంచి మే 2 వరకు అప్లై చేసుకోవచ్చు. CNC, ఆటోమేషన్, రోబోటిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్, CAD కోర్సులకు శిక్షణ ఇస్తారు. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఉత్తీర్ణులైన వారు అర్హులు. వివరాలకు ITI కార్యాలయం లేదా 9177472488, 9550112364 ను సంప్రదించండి.
# SHARE IT