News August 11, 2025

శ్రీకాళహస్తి మాజీ MLA మృతి

image

శ్రీకాళహస్తి మాజీ MLA తాటిపర్తి చెంచురెడ్డి కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తిరుపతిలోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1988 ఉప ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. టీడీపీ అభ్యర్థి కె.ఎస్.మూర్తిపై 4,419 ఓట్ల తేడాతో గెలుపొందారు. అంతకు ముందు 1978, 83, 85 ఎన్నికల్లో పోటీచేసినప్పటికీ విజయం సాధించలేదు.

Similar News

News April 17, 2026

సాయంత్రం 6 గంటల తర్వాత ఓటింగ్

image

మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై లోక్‌సభలో ఓటింగ్ ఆలస్యం కానుంది. సా.4 గంటలకే ఓటింగ్ జరగాల్సి ఉన్నప్పటికీ కేంద్రమంత్రి అమిత్ షా 6PMకు ఆ బిల్లులపై ప్రసంగించనున్నారు. షా స్పీచ్ తర్వాత ఓటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

News April 17, 2026

20న జేఈఈ మెయిన్ ఫలితాలు!

image

జేఈఈ మెయిన్-2026 ఫైనల్ ఆన్సర్ కీ, ఫలితాలను ఈ నెల 20న విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. jeemain.nta.nic.inలో అప్లికేషన్ నంబర్, బర్త్ డేట్ ఎంటర్ చేసి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. కాగా ఈ నెల 2 నుంచి 8 వరకు జరిగిన సెషన్-2 పరీక్షలకు దేశవ్యాప్తంగా 11 లక్షల మందికి పైగా హాజరయ్యారు. NIT, IITలలో ప్రవేశాల కోసం జేఈఈ ఎగ్జామ్స్‌ను రెండు దశల్లో నిర్వహిస్తారు.

News April 17, 2026

కామారెడ్డి: ఈ నెల 19న ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష

image

కామారెడ్డి జిల్లాలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్షను ఈ నెల 19 (ఆదివారం) నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఉంటుంది. 7వ నుంచి 10వ తరగతి ప్రవేశ పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు ఉంటుంది. www.tgms.telangana.gov.inలో హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.