News August 11, 2025

విద్యార్థులకు ఏటీసీ గురించి అవగాహన కల్పించాలి: KMR కలెక్టర్

image

ప్రభుత్వ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో ప్రవేశం పొంది ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ విద్యార్థులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో అసిస్టెంట్ లేబర్ కమిషనర్, ఐటీఐ కళాశాలల ప్రిన్సిపల్స్‌తో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో అడ్మిషన్ల పెంపు గురించి చర్చించారు. విద్యార్థులకు ఏటీసీ గురించి అవగాహన కల్పించాలని సూచించారు.

Similar News

News April 19, 2026

భారత్‌తో బంధం వెరీ స్ట్రాంగ్: ఇరాన్

image

భారత్, ఇరాన్ దేశాల మధ్య 5 వేల ఏళ్ల నాటి చారిత్రక సంబంధం ఉందని ఆ దేశ సుప్రీం లీడర్ ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహి స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధిలో భారత నౌకలపై జరిగిన కాల్పుల ఘటనపై స్పందిస్తూ.. సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యుద్ధం చేయడం తమ ఉద్దేశం కాదని పేర్కొన్నారు. అమెరికాతో జరిగిన చర్చలు విఫలమవడంతో భద్రతా కారణాల దృష్ట్యా జలసంధిని మూసివేస్తున్నట్లు తెలిపారు.

News April 19, 2026

చదువు ప్రాధాన్యం తెలుసుకోండి!

image

విద్యలేనివాడు విధ్వాంసుచేరువ
నుండగానే పండితుండుగాడు
కొలని హంసలకదా గొక్కెర లున్నట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: అందమైన హంసలతో కలిసి తిరిగినంత మాత్రాన కొంగ ఎప్పటికీ హంస కాలేదు. అలాగే చదువు రానివాడు, నేర్చుకోవాలనే కుతూహలం లేని వాడు విద్వాంసుల దగ్గర ఉన్నప్పటికీ పండితుడు కాలేడు. అందుకే ప్రతి ఒక్కరికీ చదువు అనేది చాలా ముఖ్యం.
<<-se>>#PADHYAM<<>>

News April 19, 2026

టిమ్ డేవిడ్.. IPLలో అరుదైన మైల్‌స్టోన్

image

ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హిట్టర్ టిమ్ డేవిడ్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. IPLలో అతి తక్కువ బంతుల్లో (560) వెయ్యి పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా నిలిచారు. ఆండ్రీ రస్సెల్ (545 బంతులు) తర్వాత ఆయనే టాప్. అంతేకాదు కనీసం వెయ్యి పరుగులు చేసిన వారిలో 175 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉన్న ఏకైక బ్యాటర్ డేవిడ్ కావడం విశేషం.