News March 31, 2024

హైదరాబాద్ నుంచి అయోధ్యకు విమాన సేవలు

image

TG: బాల రాముడి దర్శనానికి వెళ్తే భక్తుల కోసం హైదరాబాద్ నుంచి అయోధ్యకు విమాన సేవలు అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 2 నుంచి వారానికి 3 రోజులు(మంగళ, గురు, శనివారం) స్పైస్ జెట్ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఉదయం 10:00 గంటలకు బయల్దేరి 12:45కు అయోధ్యకు చేరుకుంటాయి. తిరిగి అక్కడి నుంచి మధ్యాహ్నం 01:25కి బయలుదేరుతాయి.

Similar News

News March 22, 2026

ఇదేందయ్యా ఇది.. మటన్ ఉడకలేదని పోలీస్ స్టేషన్‌కు..

image

AP: అనంతపురం పోలీసులకు వింత ఫిర్యాదు అందింది. తాడిపత్రికి చెందిన ఓ వ్యక్తి ఉగాది సందర్భంగా మటన్, తలకాయ కొనుగోలు చేశాడు. కుక్కర్‌లో సుమారు 20 సార్లు ఉడికించినా ఆ మాంసం ఉడకలేదని విక్రయదారుడిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. వండిన పాత్రతో సహా వెళ్లడంతో పోలీసులు అవాక్కయ్యారు. అతనికి సర్ది చెప్పి ఇంటికి పంపించారు.

News March 22, 2026

ఈ గ్రామంలో వర్షమే కురవదు!

image

యెమెన్‌లోని అల్ హుతైబ్ గ్రామం ప్రపంచంలోనే అత్యంత వింతైన ప్రదేశం. సముద్ర మట్టానికి సుమారు 3,200 మీటర్ల ఎత్తున పర్వత శిఖరంపై ఉండటం వల్ల ఇక్కడ అసలు వర్షమే కురవదు. మేఘాలన్నీ ఈ గ్రామం కంటే తక్కువ ఎత్తులోనే ఏర్పడటం వల్ల వర్షం పడదు. అందుకే దీనిని ‘డ్రై సిటీ’ అని పిలుస్తారు. ఇక్కడ మేఘాలు చేతికి తాకే ఎత్తులోనే ఉండటం విశేషం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో

News March 22, 2026

యుద్ధంతో పర్యావరణానికీ భారీ విధ్వంసం

image

పశ్చిమాసియాలో యుద్ధం పర్యావరణాన్నీ నాశనం చేస్తోంది. 2 వారాల్లో 5 మి. టన్నుల గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు(CO2, CH4, N20) విడుదలైనట్లు ఓ నివేదిక వెల్లడించింది. ‘ఇరాన్‌లో 20K భవనాలు దెబ్బతినడంతో 2.4M టన్నుల CO2 రిలీజైంది. 2.5-5.9మి. బ్యారెళ్ల చమురు ధ్వంసమవడంతో 1.88M టన్నుల C02 గాల్లో కలిసింది. దేశాలు వాడిన ఇంధనం, కోల్పోయిన జెట్స్, డ్రోన్లు, క్షిపణుల వల్ల కూడా విష పదార్థాలు విడుదలయ్యాయి’ అని తెలిపింది.