News August 11, 2025

ఇచ్చోడ: ‘వేధిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి’

image

వేధింపులకు గురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని షీటీం ASI వాణిశ్రీ విద్యార్థినులకు సూచించారు. సోమవారం ఇచ్చోడ ప్రభుత్వ Jr కళాశాల, ఉన్నత పాఠశాలల్లో షీటీం సేవలపై అవగాహన కల్పించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, హెల్ప్‌లైన్ నంబర్ల గురించి వివరించారు. మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం షీటీం పనిచేస్తుందన్నారు. సమస్య ఉంటే 8712659953కి కాల్ చేయాలని సూచించారు. షీటీం సిబ్బంది మహేశ్, మోహన్, రోహిణి పాల్గొన్నారు.

Similar News

News September 9, 2025

ADB: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసిన ఎంపీ నగేశ్

image

ఉప రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా జరిగిన ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీలో మంగళవారం జరిగిన ఓటింగ్ ప్రక్రియలో భాగంగా ఓటు వేసేందుకు తెలంగాణ బీజేపీ ఎంపీలతో కలిసి ఎంపీ గోడం నగేశ్ క్యూ లైన్‌లో నిలబడి ఓటు హక్కు వేశారు. ఈ సందర్భంగా ఎంపీ నగేశ్ సెల్ఫీ తీశారు.

News September 9, 2025

ADB: శాంతియుతంగా నిమజ్జనోత్సవం: ఎస్పీ

image

జిల్లాలో అందరి సహకారంతోనే గణేష్ నిమజ్జన ఉత్సవాలు శాంతియుతంగా పూర్తి చేసినట్లు ఎస్పీ అఖిల్ మహజన్ అన్నారు. నిమజ్జననోత్సవం శాంతియుతంగా పూర్తైన సందర్భంగా సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులు జిల్లా ఎస్పీని మంగళవారం కలిసి శాలువతో సత్కరించారు. సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి, పడకంటి సూర్యకాంత్, రవీందర్, కందుల రవీందర్, రాజు, మహిపాల్ తదితరులు ఉన్నారు.

News September 9, 2025

తెలంగాణ భాషకు కాళోజీ కృషి: ADB కలెక్టర్

image

ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని మంగళవారం ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షిషా పాల్గొని కాళోజీ నారాయణరావు చిత్రాటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ భాష సంరక్షణకు కాళోజీ కృషి చేశారని కొనియాడారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు సేవలు మరువలేనివని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీఓ స్రవంతి, జిల్లా అధికారులు ఉన్నారు.