News August 11, 2025

ADB: ‘ఆల్బెండజోల్ మాత్రలను వేయాలి’

image

19 ఏళ్లలోపు ప్రతి ఒక్కరికీ నులిపురుగుల నిర్మూలనకు ఆల్బెండజోల్ మాత్రలను వేయాలని కలెక్టర్ రాజర్షిషా సూచించారు. సోమవారం ఆదిలాబాద్ కేజీబీవీలో ఏర్పాటుచేసిన నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు మాత్రలు వేశారు. పిల్లలలో నులిపురుగులు ఉండటం వలన వారిలో పోషకాహార లోపం, రక్తహీనత, ఆకలి మందగించడం తదితర ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయన్నారు. డీఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్ ఉన్నారు.

Similar News

News October 28, 2025

ADB: నారీమణులకు దక్కిన 10 మద్యం షాపులు

image

కొత్త మద్యం పాలసీ 2025–27లో 34 షాపులకు గాను ఆదిలాబాద్‌లో ప్రశాంతంగా కొనసాగింది. ఇందులో భాగంగా 10 షాపులు మహిళలకు లక్కీడ్రా ద్వారా దక్కాయి. షాప్‌ నం. 2, 9 విమలబాయి దక్కించుకున్నారు. తమ కుటుంబీకులకు సంబంధించిన మహిళల పేరిట షాపులు రావడంతో వారు సంబరాల్లో మునిగితేలారు. కాగా మద్యం లక్కీడ్రాకు అధిక సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా, అదృష్టవంతుల పేర్లు వచ్చాయి.

News October 27, 2025

తేమ 12% కంటే ఎక్కువ ఉంటే రూ. 6,950: కలెక్టర్

image

మార్కెట్‌ యార్డులో కొనుగోళ్లు నిలిచిపోవడంతో పత్తి రైతుల సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్‌ రాజర్షి షా చొరవ తీసుకున్నారు. సోమవారం ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, వ్యాపారస్తులతో కలిసి రెండు గంటలు సమీక్షించారు. తేమ శాతం 12% కంటే ఎక్కువ ఉన్నా, ప్రైవేటు వ్యాపారుల ద్వారా క్వింటాలుకు ₹6,950 చెల్లించేలా ఒప్పందం కుదిరిందని కలెక్టర్‌ తెలిపారు. దీంతో రైతులకు ఊరట లభించింది.

News October 27, 2025

ADB: పుస్తక పఠనంతో ఆలోచనా శక్తి పెరుగుతుంది: కలెక్టర్

image

పుస్తకాలను చదవడం ద్వారా ఆలోచనాశక్తి, జ్ఞానం పెరుగుతాయని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదివారం స్థానిక గాంధీ పార్క్‌లో ‘పుస్తక పఠనం చేద్దాం’ కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. గ్రంథాలయాల్లో అందుబాటులో ఉన్న విలువైన పుస్తకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు.