News August 11, 2025
మెదక్ కలెక్టర్‌కు రాఖీ కట్టిన దివ్యాంగురాలు

మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్‌కు ఓ దివ్యాంగురాలు రాఖీ కట్టింది. ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండగా ఓ దివ్యాంగురాలు వచ్చి తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరులో నెలకొన్న సమస్యలను కలెక్టర్ దృష్టికి ఆమె తీసుకెళ్లారు. వెంటనే కలెక్టర్ స్పందించి నిబంధనలు, అర్హతలు పరిశీలించాలని డీఎల్పీఓను ఆదేశించారు. అనంతరం ఆమె రాఖీ కట్టేందుకు రాగా కలెక్టర్ కుర్చీలోంచి లేచి వచ్చి రాఖీ కట్టించుకున్నారు.
Similar News
News September 9, 2025
మెదక్: ఉపాధ్యాయుడిగా మారిన కలెక్టర్

టేక్మాల్ మండలం ధనురా ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మిక తనిఖీ చేశారు. భోజన నాణ్యత, విద్య బోధన తదుపరి అంశాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఎంపీపీస్ పాఠశాల విద్యార్థులతో ఆయన మాట్లాడి పాటలు బోధించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిచాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ ఎంపీడీవో రియాజుద్దీన్, ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
News September 8, 2025
మెదక్: బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా కరణం పరిణిత

బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో మెదక్ నియోజకవర్గ నేతకు చోటు లభించింది. పాపన్నపేట మండలం కొత్తపల్లికి చెందిన మాజీ మంత్రి కరణం రామచంద్రరావు కోడలు కరణం పరిణిత సోమశేఖర్ రావు రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్ర రావు ఉత్తర్వులు జారీ చేశారు. పరిణిత గతంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా పనిచేశారు.
News September 8, 2025
మెదక్: ప్రజాస్వామ్యంలో ఓటు అమూల్యమైంది: కలెక్టర్

మెదక్ జిల్లా కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ రాహుల్ రాజ్ సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 21 జడ్పీటీసీ, 190 ఎంపీటీసీ స్థానాలకు జరగనున్న ఎన్నికల కోసం 1052 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ అమూల్యమైనదని పేర్కొంటూ, ఓటరు జాబితాపై చర్చించారు. అర్హులైన ప్రతి ఓటర్ పేరు ఓటరు జాబితాలో ఖచ్చితంగా ఉండాలని తెలిపారు.