News August 11, 2025

దేవరకొండ: ‘ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవాలను విజయవంతం చేయాలి’

image

దేవరకొండలో ఏఐఎస్ఎఫ్ డివిజన్ ముఖ్య నాయకుల సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు వలమల్ల ఆంజనేయులు పాల్గొని మాట్లాడారు. దేశ స్వాతంత్య్రమే లక్ష్యంగా 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నగరంలో ఏర్పడిన మొట్టమొదటి విద్యార్థి సంఘంగా ఏఐఎస్ఎఫ్ చరిత్రలో నిలిచిందన్నారు. ఈనెల 12 నుంచి 31 వరకు జరిగే ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Similar News

News September 10, 2025

NLG: ఏటేటా తగ్గుతున్న కూరగాయల సాగు

image

జిల్లాలో కూరగాయల సాగు ఏటేటా తగ్గుముఖం పడుతోంది. ఎక్కువ శాతం MNGD, DVK, సాగర్, NKL నియోజకవర్గాల్లో కూరగాయల సాగు ఎక్కువగా చేపడుతున్నారు. సాగు గిట్టుబాటుకాకపోవడం, ప్రభుత్వం రాయితీలు కల్పించకపోవడం, మార్కెటింగ్ సదుపాయం లేకపోవడం, దళారులు రంగప్రవేశం చేయడం వంటి కారణాలతో రైతుల్లో ఆసక్తి తగ్గుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఐదేళ్ల క్రితం 42 వేల ఎకరాల్లో కూరగాయలు సాగయ్యేవి. ప్రస్తుతం 80 శాతం సాగు పడిపోయింది.

News September 10, 2025

NLG: ఒక పోలింగ్ కేంద్రం పెరిగింది.!

image

MPTC, ZPTC ఎన్నికలకు సంబంధించి ఓటరు, పోలింగ్ కేంద్రాల జాబితాలను ఫైనల్ చేశారు. ఈ నెల 6న ముసాయిదా ఓటరు, పోలింగ్ కేంద్రాల జాబితాలను ప్రకటించారు. జిల్లాలో 10,73,506 మంది ఓటర్లు, 33 ZPTC, 353 MPTC నియోజకవర్గాల పరిధిలో 1,956 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లుగా ముసాయిదా జాబితాలో ప్రకటించారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో ఎలాంటి మార్పు లేదు కానీ ఒక పోలింగ్ కేంద్రం పెరిగినట్లు జడ్పీ సీఈఓ శ్రీనివాసరావు తెలిపారు.

News September 10, 2025

NLG: డ్రైవర్ల కొరతే ఆర్టీసీకి పెద్ద సమస్య..!

image

డ్రైవర్ల కొరతతో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కని పరిస్థితి నెలకొంది. నల్గొండ, సూర్యాపేట డిపోలకు మొత్తం 156 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించారు. జీతాలు తక్కువగా ఉండడంతో పాటు.. డీలక్స్ బస్సుల డ్రైవర్లకు రోజుకు రూ.30 వేల టార్గెట్లు ఇవ్వడంతో డ్రైవర్లు ముందుకు రావడం లేదు. దీంతో ఆర్టీసీకి డ్రైవర్ల కొరత ప్రధాన సమస్యగా మారింది. టార్గెట్లతో తమపై ఒత్తిడి పెరుగుతుందని డ్రైవర్లు అంటున్నారు.