News August 11, 2025

సంగారెడ్డి: ‘ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలి’

image

విద్యా సంవత్సరం ప్రారంభమైన నాటి నుంచి ఉపాధ్యాయులను బోధనకు దూరం చేసేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు దత్తాత్రి తెలిపారు. ఇలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా టీఎల్ఎం మేళ నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు. ఉపాధ్యాయులను బోధనకు మాత్రమే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు.

Similar News

News April 15, 2026

అనకాపల్లి: ‘పెండింగ్ చలానాలు ఉంటే వాహనాలు సీజ్’

image

జిల్లా నేర సమీక్షలో ఎస్పీ తుహిన్ సిన్హా అధికారులకు దిశానిర్దేశం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్, సీట్ బెల్ట్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని సూచించారు. పెండింగ్ చలానాలు ఉంటే వాహనాలు సీజ్ చేయాలని ఆదేశించారు. రౌడీషీటర్లపై నిఘా ఉంచి, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే పీడీ యాక్ట్ పెట్టాలన్నారు. దర్యాప్తులో ఈ-సాక్ష్య, యాప్ 360 వంటి టెక్నాలజీ వాడాలని సూచించారు.

News April 15, 2026

మహిళా బిల్లుకే మా మద్దతు.. డీలిమిటేషన్‌కు లేదు: ఖర్గే

image

మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రతిపక్షాల మద్దతు ఉందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. అయితే డీలిమిటేషన్ బిల్లుకు తాము పూర్తి వ్యతిరేకమని అన్నారు. డీలిమిటేషన్‌ పేరుతో కేంద్రం గారడీలు చేస్తోందని.. జనాభా లెక్కలపై ఎలాంటి క్లారిటీ లేదని పేర్కొన్నారు. డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తామని స్పష్టం చేశారు. ఇండీ కూటమి నేతల సమావేశం అనంతరం ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.

News April 15, 2026

కడప జిల్లాలో ఇంటర్ ఒకేషనల్ ఫలితాలు ఇలా.!

image

కడప జిల్లాలో ఇంటర్ ఒకేషనల్ పరీక్షలు 2,382 మంది విద్యార్థులు రాశారు. వీరిలో 1,080 మంది పాస్ అయ్యారు.
1st ఇయర్ 592 మంది బాలురు రాయగా.. 285(31%) పాస్ అయ్యారు. 664 మంది బాలికల్లో 278(42%) పాస్ అయ్యారు. 2nd ఇయర్ బాలురు 473 మందిలో 231(49%) పాస్ అయ్యారు. బాలికలు 657 మందిలో 386(58%) పాస్ అయ్యారు. ఒకేషనల్ ఉత్తీర్ణతలో బాలుర కన్నా బాలికలే ముందంజలో ఉన్నారు.