News August 11, 2025
భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తం చేయాలి: కలెక్టర్ ప్రావీణ్య

జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. క్యాంపు కార్యాలయం నుంచి మండల స్థాయి అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద నీటిలో వాగులు వంకలు పొంగిపొర్లున్నాయని, ప్రజలు చెరువులు, కుంటల వైపు వెళ్లకుండా చూడాలని చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పేర్కొన్నారు.
-SHARE IT
Similar News
News April 20, 2026
అనంతగిరి ఏకో టూరిజం ప్రారంభించనున్న స్పీకర్

ప్రకృతి ఒడిలో పరవశించే అనంతగిరి పర్యాటక వైభవం నేడు సరికొత్త కాంతులతో వికసించనుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నేడు ఈ పర్యాటక రంగాన్ని ప్రారంభించి వికారాబాద్ కీర్తి కిరీటంలో మరో మణిహారాన్ని చేర్చనున్నారు. ఈ కార్యక్రమానికి అటవీ శాఖ చార్మినార్ జోన్ కన్జర్వేటర్ ప్రియాంక వర్గీస్, కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహమేరా హాజరవుతారని వికారాబాద్ BFO జ్ఞానేశ్వర్ తెలిపారు. VKB అభివృద్ధికి ఇది కీలకం కానుంది.
News April 20, 2026
వైజాగ్ టు సింగపూర్.. ఇంటర్నేషనల్ క్రూయిజ్‌కు ఏర్పాట్లు

AP: గతంలో విశాఖ-చెన్నై మధ్య క్రూయిజ్ షిప్ సేవలు ప్రారంభమవగా తొలిసారి ఇంటర్నేషనల్ యాత్రకు రంగం సిద్ధమైంది. కార్డిలియో నౌక జులై 15న వైజాగ్ నుంచి సర్వీసును ఆరంభించనుంది. చెన్నై మీదుగా థాయిలాండ్‌లోని ఫుకెట్, మలేషియాలోని లంకావి, కౌలాలంపూర్, చివరగా సింగపూర్‌కు షిప్ చేరుకొని తిరిగి రానుంది. మొత్తం 14 రోజులపాటు విలాసవంతమైన నౌకా విహారం ఉండనుంది. టికెట్ రేట్లపై త్వరలో క్లారిటీ రానుంది.
News April 20, 2026
HYD: పిల్లలు కలగటం లేదా? ఇక్కడికి రండి

పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు కలగక దిగులు చెందుతున్నారా? ఆ చింతన వదిలేయండి. నమ్మకంతో HYD గాంధీ ఆస్పత్రిలో IVF(సంతాన సాఫల్య కేంద్రానికి) రావాలని డా.ఇందిరా సూచిస్తున్నారు. అద్భుతమైన చికిత్స అందిస్తున్నామని, IVF సెంటర్ ప్రారంభించినప్పటి నుంచి సుమారుగా 40 శాంపిల్స్ సేకరించి, 17 మందికి IVF వైద్యం ప్రారంభించినట్లుగా ఆమె తెలిపారు. వీరిలో ఏడుగురికి పాజిటివ్ ఫలితం వచ్చిందన్నారు.
#SHARE IT


