News August 11, 2025

మార్పుల తర్వాత ఇన్‌కమ్ టాక్స్ బిల్లుకు ఆమోదం

image

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ LSలో ప్రవేశపెట్టిన ఇన్‌కమ్ టాక్స్ బిల్లు చర్చ లేకుండానే ఆమోదం పొందింది. FEBలోనే బిల్లును కేంద్రం LSలో ప్రవేశపెట్టింది. 1961 నుంచి ఎన్నో సవరణలకు గురై సంక్లిష్టంగా మారిందని విపక్షాలు అభ్యంతరం చెప్పాయి. దీంతో కేంద్రం సెలక్ట్ కమిటీకి రిఫర్ చేసింది. ఈక్రమంలోనే గత శుక్రవారం దాన్ని వెనక్కి తీసుకొని కమిటీ సూచనలతో మార్పులు చేసింది. ఇది 2026 APR 1 నుంచి అమల్లోకి రానుంది.

Similar News

News August 12, 2025

TG అప్పులు రూ.3.50 లక్షల కోట్లు: కేంద్రం

image

TG: 2024 మార్చి 31నాటికి తెలంగాణ ప్రభుత్వ అప్పులు రూ.3,50,520.39 కోట్లని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. MP రఘునందన్‌రావు ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. పదేళ్లలో BRS ప్రభుత్వం రూ.3,14,545 కోట్లు అప్పు చేసినట్లు తేల్చింది. 2014-15లో రాష్ట్ర అప్పులు రూ.69,603.87 కోట్లు, ఆస్తులు రూ.83,142.68 కోట్లుగా ఉన్నాయి. 2023-2024నాటికి అప్పులు రూ.3,50,520.39 కోట్లు, ఆస్తులు రూ.4,15,099.69 కోట్లకు పెరిగాయి.

News August 12, 2025

EP33: ఈ రెండూ మిమ్మల్ని నాశనం చేస్తాయి: చాణక్య నీతి

image

మనిషి జీవితాన్ని, ప్రశాంతతను.. కోపం, దురాశ రెండూ సర్వ నాశనం చేస్తాయని చాణక్య నీతి చెబుతోంది. రోజూ కోపంగా ఉండేవాళ్లు బతికుండగానే నరకాన్ని అనుభవిస్తుంటారని దీని సారాంశం. అలాగే మీకు దురాశ ఉంటే జీవితం సర్వనాశనం అవుతుందని చాణక్య నీతిలో చెప్పారు. లైఫ్‌లో ఏది సాధించాలన్నా కోపం, దురాశను వదిలి జ్ఞానంవైపు అడుగులు వేయాలని వివరించారు. జ్ఞానంతోనే ఏదైనా సాధించగలరని పేర్కొన్నారు. <<-se>>#Chankyaneeti<<>>

News August 12, 2025

ఆగస్టు 15 నుంచి కొత్త పాస్ బుక్స్ పంపిణీ!

image

AP: రాజముద్రతో కొత్త పట్టాదారు పుస్తకాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆగస్టు 15-31 వరకు తొలి విడతగా కొత్త పాస్ బుక్స్‌ను కొందరు రైతులకు అందిస్తారని తెలుస్తోంది. గత ప్రభుత్వం పాస్‌బుక్స్‌పై అప్పటి సీఎం జగన్ ఫొటో ముద్రించిన విషయం తెలిసిందే. వాటిని మార్చి రాజముద్రతో కొత్త పట్టాదారు పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. విడతల వారీగా 20 లక్షల మందికిపైగా ఈ కొత్త పాస్ బుక్స్ అందించనున్నారు.