News August 11, 2025

MDK: పాత పద్ధతిలోనే SSC పరీక్షలు

image

తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల శ్రేయస్సు కోసం కీలక నిర్ణయం తీసుకుంది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి SSC పబ్లిక్ పరీక్షల్లో 20% ఇంటర్నల్, ఎక్స్టర్నల్ 80% మార్కులు మూల్యాంకనానికి కేటాయించే విధానం కొనసాగనున్నట్లు DEO రాధాకిషన్ తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి యోగితా రాణి ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షా విధానంలో విద్యార్థులల్లో సమతుల్యతను తీసుకొస్తుందని పేర్కొన్నారు.

Similar News

News September 9, 2025

మెదక్: ఉపాధ్యాయుడిగా మారిన కలెక్టర్

image

టేక్మాల్ మండలం ధనురా ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మిక తనిఖీ చేశారు. భోజన నాణ్యత, విద్య బోధన తదుపరి అంశాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఎంపీపీస్ పాఠశాల విద్యార్థులతో ఆయన మాట్లాడి పాటలు బోధించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిచాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ ఎంపీడీవో రియాజుద్దీన్, ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

News September 8, 2025

మెదక్: బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా కరణం పరిణిత

image

బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో మెదక్ నియోజకవర్గ నేతకు చోటు లభించింది. పాపన్నపేట మండలం కొత్తపల్లికి చెందిన మాజీ మంత్రి కరణం రామచంద్రరావు కోడలు కరణం పరిణిత సోమశేఖర్ రావు రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్ర రావు ఉత్తర్వులు జారీ చేశారు. పరిణిత గతంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా పనిచేశారు.

News September 8, 2025

మెదక్: ప్రజాస్వామ్యంలో ఓటు అమూల్యమైంది: కలెక్టర్

image

మెదక్ జిల్లా కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ రాహుల్ రాజ్ సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 21 జడ్పీటీసీ, 190 ఎంపీటీసీ స్థానాలకు జరగనున్న ఎన్నికల కోసం 1052 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ అమూల్యమైనదని పేర్కొంటూ, ఓటరు జాబితాపై చర్చించారు. అర్హులైన ప్రతి ఓటర్ పేరు ఓటరు జాబితాలో ఖచ్చితంగా ఉండాలని తెలిపారు.