News August 12, 2025

భూభారతి సమస్యలు పరిష్కరించండి: కలెక్టర్

image

పాపన్నపేట తహసీల్దార్ కార్యాలయంను మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం సందర్శించారు. భూభారతి దరఖాస్తులను పరిశీలించారు. ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయో తదితర వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. తగు సూచనలు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నమూనా భవనాన్ని పరిశీలించి, త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. తహశీల్దార్ సతీష్ కుమార్ తదితరులు ఉన్నారు.

Similar News

News September 8, 2025

మెదక్: ప్రజావాణి వినతులు స్వీకరించిన ఎస్పీ

image

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా ఎస్పీ డీవీ.శ్రీనివాస రావు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కార్యాలయానికి తరలివచ్చి తమ సమస్యలు నేరుగా ఎస్పీ దృష్టికి తెచ్చారు. పరిష్కారం చేసే వాటిని పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి నేరుగా రావాలన్నారు.

News September 8, 2025

మెదక్: ఇన్స్ స్పైర్ ప్రదర్శనలు చేయాలి: డీఈఓ

image

ప్రైవేట్ పాఠశాలలు తప్పనిసరిగా ఇన్స్ స్పైర్ ప్రదర్శనలు చేయాలని జిల్లా విద్యాధికారి ప్రొఫెసర్ రాధా కిషన్ సూచించారు. ఓ కళాశాలలో జిల్లాలోని అన్ని ప్రైవేట్, ఉన్నత పాఠశాలల సైన్స్ ఉపాధ్యాయులకు ఇన్స్ స్పైర్ నామినేషన్లపై అవగాహన కల్పించారు. ఈనెల 15లోపు 5 నామినేషన్లు రావాలని తెలిపారు. జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి పాల్గొన్నారు.

News September 8, 2025

ధనూర: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్

image

టేక్మాల్ మండలంలోని ధనూర గ్రామంలో పలువురు లబ్ధిదారులు నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను సోమవారం కలెక్టర్ రాహుల్ రాజ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.