News August 12, 2025
ఉమ్మడి మెదక్‌లో 7,65,355 మాత్రల పంపిణీ

ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా 7,65,355 ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలో 3,77,572, సిద్దిపేట జిల్లాలో 2,09,370, మెదక్ జిల్లాలో 1,78,413 మాత్రలు పంపిణీ చేశామన్నారు. 1-19 ఏళ్ల పిల్లలకు తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని కోరారు. నేడు తీసుకొని పిల్లలు తప్పనిసరిగా మాత్ర తీసుకునేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు.
Similar News
News April 20, 2026
నిమ్మ.. ధర అదిరిందమ్మ

యాడికి మండలంలో నిమ్మకాయల ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 1100 కాయలున్న బస్తా ధర రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకు పలుకుతోంది. మండల పరిధిలోని దాదాపు 1000 ఎకరాల్లో సాగవుతున్న ఈ పంటకు మంచి గిరాకీ ఏర్పడింది. ఇక్కడి దిగుబడి హైదరాబాద్, సిరిగొండ, హోస్పేట, బళ్లారి, హుబ్లీ వంటి నగరాలకు ఎగుమతి అవుతోంది. ఆశించిన లాభాలు వస్తుండటంతో సాగుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
News April 20, 2026
జగిత్యాల: 1230 రోజుల తర్వాత ‘గులాబీ బాస్’ పర్యటన

దాదాపు 1230 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జగిత్యాల పర్యటనకు రానున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా పర్యటించిన ఆయన, ఇప్పుడు ప్రతిపక్ష నేతగా జిల్లాలో అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన చేసే వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి మార్పులకు నాంది పలుకుతాయోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ రాకతో గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది.
News April 20, 2026
సీఎం చంద్రబాబుపై సినిమా

AP: సీఎం చంద్రబాబు జీవితం, పరిపాలనా విశేషాలతో ‘ధర్మచక్రం’ సినిమాను నిర్మించినట్లు దర్శక, నిర్మాత పసుపులేటి వెంకట రమణ వెల్లడించారు. CBN బర్త్ డే సందర్భంగా ఇవాళ 13 జిల్లాల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తామని తెలిపారు. చంద్రబాబు రాష్ట్రానికి చేస్తున్న సేవలను, ఆయనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా ఇందులో వాస్తవాలను చూపించామని పేర్కొన్నారు.


