News March 31, 2024
కేసీఆర్‌ను జనం నమ్మే పరిస్థితి లేదు: అద్దంకి

TG: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ను నమ్మే పరిస్థితిలో జనం లేరని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. అసెంబ్లీకి కూడా రాని KCR రాజకీయ లబ్ధి కోసమే పొలం బాట పట్టారని విమర్శించారు. కేసీఆర్‌ను ప్రజలు ఎప్పుడో మరిచిపోయారని.. ఆయన మొసలి కన్నీరును ఎవరూ పట్టించుకోరని అన్నారు.
Similar News
News February 22, 2026
ఇవాళ గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

శుభకార్యాల సీజన్‌కు తోడు ఇవాళ ఆదివారం సెలవు కావడంతో చాలామంది బంగారం, వెండి కొనుగోళ్లకు వెళ్తుంటారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ రేట్ రూ.1,59,280గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి ధర రూ.1,46,000 పలుకుతోంది. ఇక కేజీ సిల్వర్ రేట్ రూ.2,90,000గా కొనసాగుతోంది. ఇటీవల భారీగా పెరిగిన ఈ రెండు మెటల్ రేట్స్ కాస్త తగ్గి కొనుగోలుదారులకు స్వల్ప ఊరటనిచ్చాయి.
News February 22, 2026
బండిపై ప్రయాణిస్తున్నారా..ఈ జాగ్రత్తలు తీసుకోండి

ఈ బిజీ ప్రపంచంలో మహిళలు రోజూ ప్రయాణాలు చేయడం, వాహనాలు నడపడం తప్పనిసరైంది. అయితే ఈ సమయంలో ప్రమాదాలు నివారించడానికి కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. బండి నడిపేటపుడు చీర కొంగు, చున్నీ ఎగరకుండా బిగించి కట్టుకోవాలి. లేదంటే చక్రాలకు శారీగార్డు ఏర్పాటు చేసుకోవాలి. పిల్లలతో ప్రయాణించేటపుడు టూ వీలర్ బేబీ బెల్ట్, ఛైల్డ్ క్యారియర్ వంటివి వాడటం వల్ల ప్రమాదాల తీవ్రత తగ్గుతుంది.
News February 22, 2026
BREAKING: లొంగిపోయిన దేవ్‌జీ

ఆపరేషన్ కగార్‌లో కీలక పరిణామం. మావోయిస్టు పార్టీ టాప్ కమాండర్ దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి <<19197693>>సరెండర్<<>> అయ్యారు. కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి సహా 16మందితో కలిసి ఆయన తెలంగాణ SIB ముందు లొంగిపోయారు. మార్చి 31నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామన్న కేంద్రం.. దేవ్‌జీ, రాజిరెడ్డి టార్గెట్‌గా ఇటీవల ఆపరేషన్ కగార్-2 చేపట్టింది. ఈక్రమంలోనే వారిద్దరూ లొంగిపోయారు. 2 రోజుల్లో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.


