News August 12, 2025

ఏలూరు: పీజీఆర్‌ఎస్‌కు 268 ఫిర్యాదులు

image

ఏలూరు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ఇవాళ జరిగింది. జిల్లా అధికారులు పాల్గొని అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యలను నిశితంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెట్రిసెల్వి వారిని ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి కలెక్టరు అర్జీ దారుల నుంచి 268 ఫిర్యాదులను తీసుకున్నారు.

Similar News

News April 18, 2026

కుప్పంలో మరో భారీ పరిశ్రమకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

image

గుడిపల్లి (M) కుప్పిగాని పల్లి, దాసిమానిపల్లి, అంగనామాల కొత్తూరు గ్రామాల పరిధిలో 105 ఎకరాల భూమిని NPSPL స్పెషాలిటీ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ప్రభుత్వం కేటాయించింది. రూ.2550 కోట్ల పెట్టుబడితో కాథోడ్ మెటీరియల్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 400 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ తయారీ పాలసీ (2025-30) కింద ఆమోదించింది

News April 18, 2026

తిరుపతి: వివాహితపై రేప్

image

భర్తకు దూరంగా ఉంటున్న వివాహిత(34) బతుకుతెరువు కోసం శ్రీసిటీలో పనిచేస్తోంది. BN కండిగలో ఓ వ్యక్తితో సహజీవనం చేస్తోంది. BN కండ్రిగ మండలం పదో మైలు వద్ద నివాసం ఉన్నారు. ఆమె రాత్రి వేళ కాలినడకన వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తి వెంబడించి ఆర్.అనంతాపురం చెరువు సమీపంలోని ముళ్ల పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు ఎస్సై హరిప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 18, 2026

కర్నూలు: NH-167పై ఈ ప్లేసులు చాలా డేంజర్!

image

NH-167పై పలుచోట్ల మృత్యువు మాటేసింది. తరచూ జరుగుతున్న ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. ఈ జాతీయ రహదారి కర్ణాటకలోని బళ్లారి నుంచి ఎమ్మిగనూరు మీదుగా మంత్రాలయం, రాయచూర్ వెళ్లుంది. మధ్యలో కొటేకల్ నగరవరం, ముగతి, చిలకలడోణ, కల్లుదేవకుంట, మాధవరం, చెట్నేపల్లి వద్ద పోలీసులు బ్లాక్ స్పాట్లను గుర్తించారు. ఈ ప్రాంతాల్లో ప్రమాదాల కట్టడికి అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.