News August 12, 2025

సిద్దిపేట జిల్లాలో 91 శాతం పంపిణీ

image

చిన్నారుల్లో నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్‌ మాత్రలు వాడాలని జిల్లా వైద్య అధికారులు తెలిపారు. జాతీయ నులిపురుగుల నివారణ దినం సందర్భంగా సోమవారం జిల్లావ్యాప్తంగా వైద్య సిబ్బంది అర్హులైన పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణి చేశారు. సిద్దిపేట జిల్లావ్యాప్తంగా మంది 2,29,361 విద్యార్థులు ఉండగా సోమవారం 2,09370 మంది విద్యార్థుల(91.2%)కు నివారణ మాత్రలు అందజేశారు.

Similar News

News April 18, 2026

విశాఖ-మహబూబ్‌నగర్ రైళ్ల పాక్షిక రద్దు

image

సికింద్రాబాద్-డోన్ సెక్షన్ పరిధిలోని మహబూబ్‌నగర్ – మన్యంకొండ మధ్య రైల్వే డబ్లింగ్ పనుల కారణంగా విశాఖ – మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌ను పాక్షికంగా రద్దు చేశారు. ఈ నెల 18 నుంచి 20 వరకు విశాఖలో బయలుదేరే రైలు (12861) జడ్చర్ల వరకే నడుస్తుంది. అలాగే 19 నుంచి 21 వరకు మహబూబ్‌నగర్ రైలు (12862) జడ్చర్ల నుంచే తిరుగు ప్రయాణం కానుంది. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలనీ సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్ తెలిపారు.

News April 18, 2026

పెంచలకోన వార్షిక బ్రహ్మోత్సవాలు వివరాలు ఇవే…

image

రాపూరు మండలం పెంచలకోన శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 27వ తేదీ నుంచి మే 3వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
28: ధ్వజారోహణం, శేష వాహ సేవ
29: బంగారు హనుమంత సేవ
30: బంగారు గరుడసేవ
1: కళ్యాణోత్సవం, రథోత్సవం
2: వసంతోత్సవం, అశ్వవాహన సేవ
3: గోనుపల్లిలో గ్రామోత్సవం, పల్లకి సేవ
భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలన్నారు.

News April 18, 2026

రాత్రి 8.30 గంటలకు మోదీ ప్రసంగం.. ఏం చెప్పనున్నారు?

image

ప్రధాని మోదీ ఈరోజు రాత్రి 8.30 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం తెచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంపై మాట్లాడే అవకాశం ఉంది.