News August 12, 2025

సంగారెడ్డి: ఈనెల 18 నుంచి రెండో విడత లైసెన్స్ సర్వేయర్ల శిక్షణ

image

సంగారెడ్డి జిల్లాలో రెండో విడత లైసెన్స్ సర్వేయర్ల శిక్షణ ఈనెల 18 నుంచి ప్రారంభమవుతున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య సోమవారం తెలిపారు. శిక్షణకు 172 మంది లైసెన్స్ సర్వేలను ఎంపిక చేసినట్లు చెప్పారు. బీసీ స్టడీ సర్కిల్‌లో 50 రోజులపాటు శిక్షణ జరుగుతుందని పేర్కొన్నారు. మొదటి విడత 160 మందికి శిక్షణ ఇచ్చినట్లు వివరించారు. వీరిలో 129 మందికి 28 మండలాలు కేటాయించినట్లు తెలిపారు.

Similar News

News April 18, 2026

GNT: ముందస్తు పన్ను చెల్లింపులకు విశేష స్పందన!

image

ఈ నెలాఖరులోగా ముందస్తు ఆస్తిపన్ను కడితే 5% రాయితీ ఇస్తుండటంతో మంచి స్పందన వస్తోంది. అధికారులు ముమ్మర ప్రచారం చేస్తుండటంతో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పన్నులు చెల్లిస్తున్నారు. కేవలం 9 రోజుల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో రూ. 41.10 కోట్ల పన్ను వసూలైంది. ఇందులో గుంటూరులో రూ. 32.29 కోట్లు, పల్నాడులో రూ. 5.52 కోట్లు, బాపట్లలో రూ. 2.51 కోట్లు జమ అయ్యాయి. ఈ నెలాఖరుకు వసూళ్లు మరింత పెరగనున్నాయి.

News April 18, 2026

శాతవాహన వర్సిటీలో ‘ఈసీ’ లొల్లి.. వీసీ తీరుపై నిరసన జ్వాలలు

image

శాతవాహన విశ్వవిద్యాలయం ఈసీ సభ్యుల నామినేషన్‌పై వివాదం నెలకొంది. వీసీ ప్రొ.ఉమేష్ కుమార్ నిబంధనలు ఉల్లంఘించి, ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ మంత్రి సూచనల మేరకే సభ్యులను ఎంపిక చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. సీనియర్ ప్రొఫెసర్లను పక్కనబెట్టి, వీసీ, మంత్రికి అత్యంత ఇష్టమైన వ్యక్తులను నామినేట్ చేశారని విద్యార్థులు మండిపడుతున్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు లోనై నియామకాలు జరిగాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

News April 18, 2026

కర్నూలు: 10కి చేరిన మృతుల సంఖ్య

image

మంత్రాలయం(M) చిలకలడోణ గ్రామ సమీపాన గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి చేరింది. ప్రమాదం జరిగిన రోజు కర్ణాటక రాష్ట్రానికి చెందిన దీపిక, బెల్లి, యశోద, పుట్టమ్మ, లాలాక్షి, మీనాక్షి, సునీల్, కుమార్ మృతిచెందారు. కర్నూలు GGHలో చికిత్స పొందుతూ తేజస్విని శుక్రవారం మృతి చెందింది. నేడు శోభ అనే మహిళ మరణించింది. మరికొందరు చికిత్స పొందుతున్నారు.