News August 12, 2025
హర్ ఘర్ తిరంగాలో భాగస్వాములు కావాలి: నంద్యాల కలెక్టర్

79వ స్వాతంత్ర దినోత్సవంలో జాతీయ సమైక్యతకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో సమావేశం నిర్వహించారు. జిల్లా అధికారులకు కార్యక్రమ నిర్వహణకు కీలక సూచనలు జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను త్రివర్ణ దీపాలతో అలంకరించాలని ఆదేశించారు.
Similar News
News April 15, 2026
HNK: ఓఆర్‌ఆర్‌పై యాక్సిడెంట్.. తండ్రీకొడుకుల మృతి

ఔటర్ రింగ్ రోడ్డుపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో HNK జిల్లాకు చెందిన తండ్రీకొడుకులు దుర్మరణం పాలయ్యారు. HYD పెద్ద అంబర్‌పేట్-బొంగులూరు మార్గంలో ప్రయాణిస్తున్న వేద ప్రకాశ్ రెడ్డి (37) కారు అదుపుతప్పి ముందున్న నీటి ట్యాంకర్‌ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో వేద ప్రకాశ్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన ఆయన రెండున్నరేళ్ల కుమారుడు అర్జున్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.
News April 15, 2026
డీలిమిటేషన్ బిల్లు.. NDAకు మెజార్టీ ఉందా?

మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుల రాజ్యాంగ సవరణల ఆమోదానికి లోక్‌సభలో 364మంది సభ్యుల మద్దతు అవసరం. NDAకు 293మంది MPలు ఉన్నారు. దీంతో కొన్ని ప్రతిపక్ష పార్టీలను ఒప్పించడానికి, చీల్చడానికి, గైర్హాజరు చేయించడానికి BJP యత్నిస్తోందని కొన్ని పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇక NDA పార్టీలన్నీ తమ MPలకు విప్ జారీ చేశాయి. ఉమెన్ రిజర్వేషన్ బిల్లు నేపథ్యంలో ఆయా పార్టీల మహిళా నేతలను LS గ్యాలరీకి రప్పిస్తున్నారు.
News April 15, 2026
BSNLలో 120 పోస్టులు.. నేటితో ముగియనున్న గడువు

BSNLలో 120 Sr. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి BE/BTech (EE & టెలికమ్యూనికేషన్స్/ఎలక్ట్రానిక్స్/ CS/IT/ఎలక్ట్రికల్/ఇన్‌స్ట్రుమెంటేషన్), CA/CMA అర్హత గల వారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు సవరణకు రేపటి నుంచి 23వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. వయసు 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. పరీక్ష తేదీని త్వరలో ప్రకటిస్తారు. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్: bsnl.co.in చూడండి.


