News August 12, 2025
చెప్పే కథ ఒకటి.. తీసేది ఇంకొకటి: అనుపమ

తాము ఓకే చేసిన స్క్రిప్టు మూవీ పూర్తయ్యేలోగా మారిపోతూ ఉంటుందని హీరోయిన్ అనుపమ పేర్కొన్నారు. ‘పరదా’ మూవీ ప్రమోషన్స్‌లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కథ మాత్రమే కాదు పాత్రల విషయంలోనూ ఇలాంటి మార్పులు ఉంటూనే ఉంటాయి. అవన్నీ తెలియక ప్రేక్షకులు ఇలాంటి చెత్త సినిమాలు ఎందుకు చేస్తారు? అని ప్రశ్నిస్తూ ఉంటారు’ అని వ్యాఖ్యానించారు. ‘జానకి వి vs స్టేట్ ఆఫ్ కేరళ’ చిత్రం గురించే ఇలా స్పందించినట్లు తెలుస్తోంది.
Similar News
News August 12, 2025
ప్రముఖ రచయిత్రి అనిశెట్టి రజిత కన్నుమూత

TG: వరంగల్‌కు చెందిన ప్రముఖ రచయిత్రి, కవయిత్రి అనిశెట్టి రజిత(67) నిన్న రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఆదివారం ఓ పుస్తకావిష్కరణలో యాక్టివ్‌గా కనిపించిన ఆమె అకస్మాత్తుగా మరణించడం సాహితీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. సామాజిక అంశాలపై ఆమె రాసిన పుస్తకాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. TG తొలి, మలి దశ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించాయి. 500 కవితలు, 100 వ్యాసాలు, 30కి పైగా పాటలు రాశారు.
News August 12, 2025
అందుబాటులోకి రాని టికెట్లు.. ఏ సినిమా కోసం వెయిటింగ్?

ఎన్టీఆర్, హృతిక్ నటించిన ‘వార్-2’, రజినీకాంత్ నటించిన ‘కూలీ’ రెండు రోజుల్లో థియేటర్లలో విడుదల కానున్నాయి. అయినా ఈ సినిమాలకు సంబంధించి టికెట్లు ఇంకా అందుబాటులోకి రాలేదు. టికెట్ల ధరలు పెంపు, తొలి రోజు షో టైమింగ్స్‌పై స్పష్టత రాకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. దీనిపై ఇవాళ సాయంత్రం కల్లా క్లారిటీ వచ్చే అవకాశముందని సమాచారం. మీరు ఏ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు?
News August 12, 2025
డీఎస్సీ ఫలితాలు.. అభ్యర్థులకు అలర్ట్

AP: మెగా DSC <<17374210>>ఫలితాలు<<>> నిన్న రాత్రి విడుదలయ్యాయి. DSC నార్మలైజేషన్, టెట్ వెయిటేజీ మార్కులు కలిపి విద్యాశాఖ ఫలితాలను ప్రకటించింది. టెట్ మార్కులపై అభ్యంతరాలుంటే అప్డేట్ చేసుకునేందుకు ఇవాళ, రేపు అవకాశం కల్పించింది. అభ్యంతరాల పరిశీలన తర్వాత సవరించిన తుది మార్కులను రిలీజ్ చేయనుంది. అనంతరం జిల్లాల వారీగా జాబితాలు ప్రకటించి పోస్టులు, రిజర్వేషన్ల ప్రకారం ఎంపికైన అభ్యర్థుల వివరాలను వెల్లడించే ఛాన్స్ ఉంది.