News August 12, 2025

భారత్ సరిహద్దు సమీపంలో చైనా రైల్వే లైన్!

image

ఇండియా సరిహద్దు సమీపంలో చైనా రైల్వేలైన్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో కొంత భాగం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(LAC) సమీపంలో ఉంటుందని చెప్తున్నారు. టిబెట్‌ను షిన్‌జాంగ్ ప్రావిన్సుతో కలపనున్నారు. రూ.1.15 లక్షల కోట్ల క్యాపిటల్‌తో ‘ది షిన్‌జాంగ్-టిబెట్ రైల్వే కంపెనీ’ని రిజిస్టర్ చేశారని చైనా మీడియాలో వార్తలొచ్చాయి. LAC సమీపంలో కాబట్టి రక్షణపరంగా భారత్ ఆందోళన చెందాల్సిన అవసరముంది.

Similar News

News August 12, 2025

చైనాపై టారిఫ్స్.. మళ్లీ వెనక్కి తగ్గిన ట్రంప్

image

చైనాపై టారిఫ్స్ సస్పెన్షన్‌ను ట్రంప్ మరో 90 రోజులకు పొడిగించారు. ఇరు దేశాలు పరస్పర ప్రతీకార సుంకాలను నవంబర్ 10 వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించాయి. టారిఫ్స్ సస్పెన్షన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ఇప్పుడే సంతకం చేశానని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. కాగా భారత్‌పై 50% సుంకాలు విధించిన ట్రంప్ రష్యా నుంచి అత్యధికంగా ఆయిల్ కొంటున్న చైనాపై మాత్రం వెనకడుగు వేస్తున్నట్లు మరోసారి స్పష్టమైంది.

News August 12, 2025

ప్రముఖ రచయిత్రి అనిశెట్టి రజిత కన్నుమూత

image

TG: వరంగల్‌కు చెందిన ప్రముఖ రచయిత్రి, కవయిత్రి అనిశెట్టి రజిత(67) నిన్న రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఆదివారం ఓ పుస్తకావిష్కరణలో యాక్టివ్‌గా కనిపించిన ఆమె అకస్మాత్తుగా మరణించడం సాహితీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. సామాజిక అంశాలపై ఆమె రాసిన పుస్తకాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. TG తొలి, మలి దశ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించాయి. 500 కవితలు, 100 వ్యాసాలు, 30కి పైగా పాటలు రాశారు.

News August 12, 2025

అందుబాటులోకి రాని టికెట్లు.. ఏ సినిమా కోసం వెయిటింగ్?

image

ఎన్టీఆర్, హృతిక్ నటించిన ‘వార్-2’, రజినీకాంత్ నటించిన ‘కూలీ’ రెండు రోజుల్లో థియేటర్లలో విడుదల కానున్నాయి. అయినా ఈ సినిమాలకు సంబంధించి టికెట్లు ఇంకా అందుబాటులోకి రాలేదు. టికెట్ల ధరలు పెంపు, తొలి రోజు షో టైమింగ్స్‌పై స్పష్టత రాకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. దీనిపై ఇవాళ సాయంత్రం కల్లా క్లారిటీ వచ్చే అవకాశముందని సమాచారం. మీరు ఏ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు?