News August 12, 2025

APLలో ఇవాళ్టి మ్యాచులు ఇవే

image

AP: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్4 సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. నిన్న మొదటి మ్యాచ్‌లో తుంగభద్ర వారియర్స్‌పై అమరావతి రాయల్స్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. రెండో మ్యాచ్‌లో సింహాద్రి వైజాగ్ లైన్స్‌పై కాకినాడ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇవాళ మధ్యాహ్నం 1.30 గం.కు భీమవరం బుల్స్, అమరావతి రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. సా.6.30గం.కు విజయవాడ సన్ షైనర్స్, సింహాద్రి వైజాగ్ లైన్స్ తలపడనున్నాయి.

Similar News

News August 12, 2025

అకౌంట్లో డబ్బులు పడ్డాయా?

image

పంట బీమా(PMFBY) కోసం నిన్న కేంద్రం రైతుల ఖాతాలకు రూ.3900 కోట్లు బదిలీ చేసింది. రైతులు తమ ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యాయా? లేదా? అని తెలుసుకునేందుకు <>pmfby.gov.in<<>> వెబ్‌సైట్‌కి వెళ్లాలి. ఫార్మర్ కార్నర్ ఆప్షన్‌కు వెళ్లి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, క్యాప్చాను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఓటీపీని ఎంటర్ చేసి అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేయాలి. పాలసీ నంబర్, ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే స్టేటస్ తెలుస్తుంది.

News August 12, 2025

ZPTC ఉపఎన్నికలపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

image

AP: పులివెందుల, ఒంటిమిట్ట ZPTC స్థానాలకు జరుగుతున్న ఉపఎన్నికలపై ఎలక్షన్ కమిషన్‌కు వైసీపీ ఫిర్యాదు చేసింది. అమరావతిలోని ఈసీ కార్యాలయం ముందు మోకాళ్లపై కూర్చొని ఆ పార్టీ నేత అంబటి రాంబాబు నిరసన చేపట్టారు. బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని నినదించారు.

News August 12, 2025

ఇది కాంగ్రెస్ అరాచక పాలనకు నిదర్శనం: బండి సంజయ్

image

TG: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హౌస్ అరెస్టు కాంగ్రెస్ అరాచక పాలనకు నిదర్శనమని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైరయ్యారు. పెద్దమ్మ గుడిలో పూజలు చేస్తే తప్పేంటని, గుడిని కూల్చిన గూండాలను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓట్ల లబ్ధికి కాంగ్రెస్ ఇలా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు త్వరలో రానున్నాయన్నారు.