News August 12, 2025
ఇన్‌కమ్ టాక్స్ బిల్లు-2025లో ఏం మారాయి?

ఇవాళ ఆమోదం <<17375107>>పొందిన<<>> ఇన్‌కమ్ టాక్స్ బిల్లు-2025లో కొన్ని పదాలను మార్చారు. పాత బిల్లులో ‘క్రితం సంవత్సరం, అసెస్‌మెంట్ ఇయర్’ అనే పదాల స్థానంలో ‘టాక్స్ ఇయర్’ అని రీప్లేస్ చేశారు. కొత్త పన్నులు, శ్లాబులు, ఐటీఆర్ ఫైలింగ్ గడువు తేదీలు, రేట్లనేమీ మార్చలేదు. స్టాండర్డ్ డిడక్షన్, గ్రాడ్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ తదితర సెక్షన్లు, నిబంధనలను ఒక పట్టిక రూపంలోకి తీసుకొచ్చారు. బిల్లు కోసం ఇక్కడ <
Similar News
News August 12, 2025
అకౌంట్లో డబ్బులు పడ్డాయా?

పంట బీమా(PMFBY) కోసం నిన్న కేంద్రం రైతుల ఖాతాలకు రూ.3900 కోట్లు బదిలీ చేసింది. రైతులు తమ ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యాయా? లేదా? అని తెలుసుకునేందుకు <
News August 12, 2025
ZPTC ఉపఎన్నికలపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

AP: పులివెందుల, ఒంటిమిట్ట ZPTC స్థానాలకు జరుగుతున్న ఉపఎన్నికలపై ఎలక్షన్ కమిషన్‌కు వైసీపీ ఫిర్యాదు చేసింది. అమరావతిలోని ఈసీ కార్యాలయం ముందు మోకాళ్లపై కూర్చొని ఆ పార్టీ నేత అంబటి రాంబాబు నిరసన చేపట్టారు. బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని నినదించారు.
News August 12, 2025
ఇది కాంగ్రెస్ అరాచక పాలనకు నిదర్శనం: బండి సంజయ్

TG: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హౌస్ అరెస్టు కాంగ్రెస్ అరాచక పాలనకు నిదర్శనమని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైరయ్యారు. పెద్దమ్మ గుడిలో పూజలు చేస్తే తప్పేంటని, గుడిని కూల్చిన గూండాలను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓట్ల లబ్ధికి కాంగ్రెస్ ఇలా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు త్వరలో రానున్నాయన్నారు.