News August 12, 2025

ప్రభుత్వ లక్ష్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి: అదనపు కలెక్టర్

image

జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టరే నగేష్ సూచించారు. సోమవారం మెదక్ కలెక్టరేట్‌లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామంతపూర్‌లో 2025 -26 విద్యా సంవత్సరానికి 1వ తరగతి(ఇంగ్లీష్ మీడియం)లో ప్రవేశం కోసం లక్కీ డ్రా తీశారు.

Similar News

News April 18, 2026

చరిత్రకు సజీవ సాక్ష్యం మెదక్ ఖిల్లా

image

మెదక్‌లో చారిత్రక కీర్తిని చాటుతూ నిలిచిన మెదక్ ఖిల్లా పర్యాటకులను ఆకర్షిస్తోంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ కోట కాకతీయుల కాలంలో నిర్మాణం చెంది, అనంతరం కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీలు అభివృద్ధి చేశారు. బలమైన గోడలు, అద్భుత నిర్మాణ శైలి ఖిల్లా వైభవాన్ని ప్రతిబింబిస్తున్నాయి. పైభాగం నుంచి కనిపించే ప్రకృతి అందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రాంత చరిత్రను గుర్తు చేస్తూ వారసత్వ చిహ్నంగా ఇది నిలిచింది.

News April 18, 2026

జనగణనకు సిద్ధం కావాలి: అదనపు కలెక్టర్

image

తూప్రాన్ ఐవోసీ భవనంలో శుక్రవారం జనగణనపై అదనపు కలెక్టర్ నగేశ్ సమీక్ష నిర్వహించారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ ప్రక్రియకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. బ్లాకులుగా విభజించి పకడ్బందీగా గణన చేపట్టాలని సూచించారు. సమావేశంలో ఆర్డీవో జయచంద్ర రెడ్డి, MRO చంద్రశేఖర్ రెడ్డి, MPDO సతీశ్ పాల్గొన్నారు. గణన సమయంలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

News April 18, 2026

ద్విచక్ర వాహనాలు ఢీ.. పదో తరగతి విద్యార్థి మృతి

image

టేక్మాల్ (M) ఎల్లంపల్లి వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సండ్రు సదానందం (16) మృతి చెందగా, శెట్టి గోపాల్ (28) తీవ్రంగా గాయపడ్డాడు. వీరిద్దరూ వేర్వేరు బైక్‌లపై వెళ్తుండగా ఎదురెదురుగా ఢీకొన్నారు. ఆస్పత్రికి తరలించేలోపే సదానందం ప్రాణాలు కోల్పోయినట్లు గ్రామస్థులు తెలిపారు. మృతుడు ఇటీవలనే SSC పరీక్షలు రాశాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.