News August 12, 2025
ఆగస్టు 15 నుంచి కొత్త పాస్ బుక్స్ పంపిణీ!

AP: రాజముద్రతో కొత్త పట్టాదారు పుస్తకాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆగస్టు 15-31 వరకు తొలి విడతగా కొత్త పాస్ బుక్స్‌ను కొందరు రైతులకు అందిస్తారని తెలుస్తోంది. గత ప్రభుత్వం పాస్‌బుక్స్‌పై అప్పటి సీఎం జగన్ ఫొటో ముద్రించిన విషయం తెలిసిందే. వాటిని మార్చి రాజముద్రతో కొత్త పట్టాదారు పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. విడతల వారీగా 20 లక్షల మందికిపైగా ఈ కొత్త పాస్ బుక్స్ అందించనున్నారు.
Similar News
News April 18, 2026
టెన్త్ ఫలితాలు ఎప్పుడంటే?

తెలంగాణ టెన్త్ పరీక్ష పేపర్ల వాల్యుయేషన్ ఈ నెల 23తో ముగించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. తరువాత మార్కుల నమోదు ప్రక్రియకు మరో పది రోజుల సమయం పట్టనుంది. దీంతో మే 4 లేదా 5 తేదీల్లో ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. టీజీలో మొత్తం 5.17 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాశారు.
అలాగే ఏపీలో ఈ నెలాఖరులో వెల్లడించేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు.
News April 18, 2026
గ్రీన్ జెర్సీలో బరిలోకి దిగనున్న RCB

IPL-2026లో ఈరోజు RCBతో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. మధ్యాహ్నం 3:30 గంటల నుంచి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ మ్యాచులో ఆర్సీబీ గ్రీన్ కలర్ జెర్సీలో బరిలోకి దిగనుంది. ‘Go Green’ ఇనిషియేటివ్ కింద ఏటా ఒక హోమ్ మ్యాచ్‌లో ఆ జట్టు ప్లేయర్లు గ్రీన్ జెర్సీ ధరిస్తుంటారు. కాగా RCBలో ఈ ట్రెండ్ 2011 నుంచి కొనసాగుతోంది.
News April 18, 2026
జియో IPO.. టార్గెట్ రూ.50,000కోట్లు!

రిలయన్స్ జియో త్వరలో ఐపీఓకు రానున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో సెబీకి ఐపీవో పత్రాలను సమర్పించనుంది. సుమారు రూ.40,000-50,000కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఇదే జరిగితే దేశంలో అతిపెద్ద ఐపీఓగా రికార్డ్ నెలకొల్పనుంది. IPO నిర్వహణ కోసం 17 మర్చంట్ బ్యాంకింగ్ సంస్థలను జియో నియమించుకుంది. సంస్థ మార్కెట్ వాల్యూ రూ.16.72లక్షల కోట్లు కాగా ఇందులో 2.5% వాటా విక్రయించాలని యోచిస్తున్నట్లు సమాచారం.


