News August 12, 2025

ఏడుపాయల హుండీ ఆదాయం రూ.26.59 లక్షలు

image

ఏడుపాయల వన దుర్గాభవాని మాత ఆలయ హుండీని దేవాదాయ, ధర్మాదాయ శాఖ సమక్షంలో శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ సభ్యులు, ఆలయ సిబ్బంది సోమవారం లెక్కించారు. గడిచిన 46 రోజుల హుండీని లెక్కించగా రూ.26,59,009 ఆదాయం సమకూరింది. దేవదాయ శాఖ స్పెషల్ ఆఫీసర్ సులోచన, ఈఓ చంద్రశేఖర్, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. స్థానిక ఎస్సై శ్రీనివాస్ గౌడ్, సిబ్బంది ఆధ్వర్యంలో పర్యవేక్షణ కొనసాగింది.

Similar News

News September 8, 2025

ధనూర: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్

image

టేక్మాల్ మండలంలోని ధనూర గ్రామంలో పలువురు లబ్ధిదారులు నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను సోమవారం కలెక్టర్ రాహుల్ రాజ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

News September 8, 2025

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి దామోదర్

image

గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ ‌మంత్రి సి.దామోదర్ రాజనర్సింహ అన్నారు. సోమవారం మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో పర్యటనకు రాగా కలెక్టర్ రాహుల్ రాజ్, ఆర్డీఓ రమాదేవి స్వాగతం పలికారు. బీటీ రోడ్లకు శంకుస్థాపనలు చేశారు. స్థానిక నాయకులు రమేష్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

News September 8, 2025

మెదక్ జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం ఆందోళనలు

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం ఆందోళనలు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం
చేగుంటలో యూరియా కోసం కోసం రైతులు రోడ్డు ఎక్కారు. గాంధీ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. రామయంపేట పీఏసీఎస్ వద్ద క్యూ లైన్ లో రైతులు చెప్పులు పెట్టారు. శివ్వంపేట ప్రాథమిక సహకార సంఘం ముందు, నర్సాపూర్ రోడ్డుపై రైతులు ధర్నాకు దిగడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.