News August 12, 2025
మరో కేసులో కాకాణికి బెయిల్

నెల్లూరు జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి మరో కేసులో ఊరట లభించింది. ముత్తుకూరు మండలం పంటపాలెంలో అక్రమ మద్యం నిల్వ చేసిన కేసులో ఆయనకు బైయిల్ మంజూరైంది. కాకాణి బెయిల్ పిటిషన్ పరిశీలించి నాలుగో అదనపు జిల్లా జడ్జి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు. ఆయనపై మొత్తం 8 కేసులు నమోద కాగా ఇప్పటివరకు ఐదు కేసుల్లో బెయిల్ వచ్చింది. మిగిలిన కేసుల్లో బెయిల్ వస్తేనే జైలు నుంచి రిలీజ్ అవుతారు.
Similar News
News November 7, 2025
వందేమాతరాన్ని ఆలపించిన నెల్లూరు కలెక్టర్

స్వాతంత్య్ర సంగ్రామంలో భారతీయులను ఏకతాటిపైకి తీసుకొచ్చి స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించిన దేశభక్తి గేయం వందేమాతరం అని నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా కొనియాడారు. వందేమాతరం 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కలెక్టరేట్‌లో వందేమాతరం గేయాన్ని శుక్రవారం ఉదయం ఆలపించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వందేమాతరం గేయాన్ని అందరూ గౌరవించాలని సూచించారు.
News November 7, 2025
నెల్లూరు: కాంట్రాక్టర్లపై పోలీసులకు ఫిర్యాదు

నెల్లూరు జిల్లా ఉదయగిరి(M) గంగిరెడ్డిపల్లి జగనన్న లేఅవుట్ కాంట్రాక్టర్లపై లబ్ధిదారులతో కలిసి హౌసింగ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇళ్లు నిర్మించకుండా కాంట్రాక్టర్లు తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, దేవండ్ల పిచ్చయ్య నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయకుండా తప్పించుకు తిరుగుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మీ ఏరియాలోనూ కాంట్రాక్టర్లు ఇలాగే చేశారా?
News November 7, 2025
నెల్లూరు: లోకేష్ వార్నింగ్ ఎవరికో..?

దగదర్తిలో నారా లోకేశ్ ఇచ్చిన వార్నింగ్ కలకలం రేపుతోంది. మాలేపాటి కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. కించపరుస్తూ పోస్టులు పెట్టడాన్ని గమనించాం. దీని వెనకాల ఎవరున్నా చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంటాం.. యాక్షన్‌లో చూపిస్తాం’ అన్నారు. మరి ఇది ఎవరిని ఉద్దేశించి అన్నారనేది టీడీపీలో కాక రేపుతోంది.


