News August 12, 2025

4 రోజులే గడువు.. దత్తత ప్రక్రియ పూర్తి చేయండి: కలెక్టర్

image

ఆగ‌స్టు 15 నాటికి జిల్లాలో బంగారు కుటుంబాల ద‌త్త‌త ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల‌ని క‌లెక్ట‌ర్ తమీమ్ అన్సారియా ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్‌లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో మార్గదర్శకుల ఎంపికను సైతం పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

Similar News

News September 10, 2025

ప్రకాశం: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

ప్రకాశం జిల్లా దొనకొండ వాసులకు MP మాగుంట శ్రీనివాసులరెడ్డి శుభవార్త చెప్పారు. ఇకపై దొనకొండ రైల్వే స్టేషన్‌లో 3 ప్రధాన రైళ్లు ఆగనున్నాయి. గత నెలలో రైల్వే GMకు MP మాగుంట దొనకొండ, కురిచేడులలో పలు రైళ్లు నిలుపుదల చేయాలని కోరారు. ఈ మేరకు రైల్వే అధికారులు దొనకొండలో అమరావతి ఎక్స్‌ప్రెస్, యశ్వంత్‌పూర్, వాస్కోడిగామా, ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లను నిలుపుదల చేస్తున్నట్లు మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది.

News September 10, 2025

ఒంగోలు: బడి ఈడు పిల్లలు బడికి వెళ్లేలా చూడాలి

image

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఇబ్రహీం షరీఫ్ ప్రతి బాలుడు, బాలిక తప్పనిసరిగా ప్రైవేటు లేదా ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్య అభ్యసించాలని అన్నారు. మంగళవారం ఒంగోలు జిల్లా న్యాయస్థానం ప్రాంగణంలో ‘లీగల్ సర్వీసెస్ టు చిల్డ్రన్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలల హక్కులపై మాట్లాడారు. జిల్లా అధికారులతో కలిసి కార్యక్రమం నిర్వహించారు.

News September 9, 2025

ప్రకాశంకు 3 రోజులు వర్షసూచన.. తస్మాత్ జాగ్రత్త!

image

ఉపరితల ఆవర్తన ప్రభావంతో మూడు రోజుల పాటు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని APSDMA ప్రకటించింది. ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో అధిక ప్రభావం ఉంటుందని తెలిపింది. గత 3 రోజులుగా తీవ్ర వేడిమిలో బాధపడుతున్న ప్రజలకు ఇది చల్లని కబురు. అయితే మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.