News March 31, 2024
టీడీపీకి షాక్.. ఇద్దరు కీలక నేతలు ఔట్?

AP: ఉమ్మడి అనంతపురం జిల్లాలో TDPకి షాక్ తగిలే అవకాశం ఉంది. అనంతపురం అర్బన్ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన మాజీ MLA ప్రభాకర్ చౌదరి ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అటు కదిరి టికెట్ దక్కకపోవడంతో మాజీ MLA చాంద్ బాషా TDPకి రాజీనామా చేశారు. రేపు సీఎం జగన్ సమక్షంలో YCPలో చేరనున్నారు. కాగా అనంత టికెట్ దగ్గుపాటి ప్రసాద్, కదిరి టికెట్ వెంకటప్రసాద్‌కు టీడీపీ ఇచ్చింది.
Similar News
News January 29, 2026
సర్పవరంలో క్రికెట్ స్టేడియం.. స్థలాన్ని పరిశీలించిన సానా సతీశ్

సర్పవరం భావనారాయణ స్వామి ఆలయానికి చెందిన 16.55 ఎకరాల స్థలంలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ స్థలాన్ని గురువారం ఎంపీ, క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సానా సతీశ్ పరిశీలించారు. స్టేడియం ఏర్పాటుతో సర్పవరం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఈవో శ్రీనివాస్ ఎంపీకి స్థల వివరాలను వివరించారు. స్టేడియం నిర్మాణంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందనుంది.
News January 29, 2026
మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్?

దివంగత అజిత్ పవార్ స్థానంలో ఆయన భార్య సునేత్రా పవార్‌ను మహారాష్ట్ర Dy.CMగా ప్రతిపాదించాలని NCP యోచిస్తోంది. పార్టీ సీనియర్ నేతలు ఇప్పటికే ఆమెతో చర్చలు జరిపారు. అజిత్ మరణంతో ఖాళీ అయిన బారామతి నుంచి ఆమె పోటీ చేసే అవకాశం ఉంది. పార్టీ అధ్యక్షుడిగా ప్రఫుల్ పటేల్ బాధ్యతలు తీసుకోనున్నట్లు సమాచారం. ఈ వ్యవహారాలు పూర్తైన తర్వాతే శరద్ పవార్ నేతృత్వంలోని NCP(SP)లో విలీనంపై చర్చలు జరగొచ్చని తెలుస్తోంది.
News January 29, 2026
కల్తీకి కేరాఫ్ అడ్రస్ జగన్: మంత్రి సవిత

AP: తిరుమల వేంకన్న ఆస్తులు కొట్టేయాలన్న కుట్రతో పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని జగన్ కల్తీ చేయించారని మంత్రి సవిత మండిపడ్డారు. పామాయిల్, ఇతర కెమికల్స్‌తో లడ్డూ కల్తీ జరిగిందని, నెయ్యి లేదని సిట్ స్పష్టం చేసిందన్నారు. జంతుకొవ్వు లేదు కదా అని చేసిన తప్పు కప్పిపుచ్చుకోడానికి YCP బ్యాచ్ బుకాయిస్తోందని ఫైరయ్యారు. కల్తీకి కేరాఫ్ అడ్రస్ జగన్ అని, కల్తీ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు.


