News August 12, 2025
విజయవాడ: ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం

ఎన్టీఆర్ జిల్లాలో ఇసుకను అక్రమంగా రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నవారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. మూడుసార్లు కంటే ఎక్కువ అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై క్రైమ్ సస్పెక్ట్ షీట్ తెరవాలని అధికారులు నిర్ణయించారు. ఈ చర్య ద్వారా ఇసుక అక్రమార్కులకు అడ్డుకట్ట వేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ కఠిన నిర్ణయంతో అక్రమ రవాణా గణనీయంగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.
Similar News
News April 19, 2026
GWL: రైతులకు గుడ్ న్యూస్.. రైతు భరోసా నిధులు విడుదల

సీఎం రేవంత్ రెడ్డి భూపాలపల్లి నుంచి బటన్ నొక్కి రైతు భరోసా రెండో విడత నిధులు రేపు విడుదల చేస్తారని గద్వాల జిల్లా వ్యవసాయ అధికారి వీరప్ప ఆదివారం ప్రకటనలో తెలిపారు. రైతు భరోసా నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని రైతు వేదికల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని రైతులందరూ వారి సమీపంలోని రైతు వేదికల వద్దకు చేరుకొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
News April 19, 2026
ఆహారాన్ని వేగంగా తింటున్నారా?

ఉరుకులు పరుగుల జీవితంలో చాలామందికి తినడానికి టైమ్ దొరకట్లేదు. వేగంగా తినడం వల్ల కడుపు నిండిందనే సిగ్నల్ బ్రెయిన్‌కు వెళ్లడం ఆలస్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఎక్కువగా తినేస్తే బరువు పెరిగే అవకాశం ఉందంటున్నారు. ‘ఆహారాన్ని సరిగ్గా నమలకపోవడం వల్ల జీర్ణసమస్యలు వస్తాయి. ఇలాగే ఎక్కువ రోజులు కొనసాగితే కొవ్వు పేరుకుపోయి గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి సమస్యలు వస్తాయి’ అని పేర్కొంటున్నారు.
News April 19, 2026
విజయ్‌తో విడాకులు.. రూ.250 కోట్లు కోరిన సంగీత?

TVK చీఫ్ విజయ్, సంగీత విడాకులు తీసుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. పరస్పర అంగీకారంతో విడిపోవడానికి లాయర్ల సమక్షంలో ఇటీవల చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై త్వరలోనే కోర్టులో విచారణ జరగనుంది. సెటిల్మెంట్ కింద రూ.250 కోట్లు కావాలని సంగీత కోరగా రూ.35 కోట్లను విజయ్ ప్రతిపాదించినట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అలాగే పిల్లల బాధ్యతను తానే తీసుకుంటానని ఆయన చెప్పినట్లు పేర్కొంటున్నాయి.


