News August 12, 2025
తెనాలి: వందేమాతరం నినాదాన్ని జ్వాలలా రగిలించిన సైరా చిన్నపరెడ్డి

గాదె చిన్నపరెడ్డి @ సైరా చిన్నపరెడ్డి.. తెనాలి డివిజన్ చేబ్రోలు సమీప కొత్తరెడ్డిపాలెం స్వస్థలం. రెడ్డి రాజుల పరాక్రమాన్ని పుణికి పుచ్చుకున్న స్వాతంత్రోద్యమకారుడు. జాతీయోద్యమాన్ని మలుపు తిప్పిన 1909 కోటప్పకొండ దొమ్మీ ఆయన సాహసానికి ప్రతీక. వందేమాతరం నినాదంతో స్ఫూర్తిని పొంది, ఉద్యమానికి ఊపిరిలూదిన చిన్నపరెడ్డిపై గాయకులు, కథకులు ఎన్నో గేయాలు రాశారు. చివరికి బ్రిటిష్ పాలకుల కక్షకు ఉరికొయ్యన ఊయలలూగాడు.
Similar News
News September 9, 2025
GNT: అమ్మకు కష్టం వస్తే.. ఆశ్రయం కల్పించారు

తక్కెళ్లపాడు రోడ్డులో సోమవారం ఓ వృద్దురాలు దీనస్థితిలో పడి ఉండటం స్థానికులను కలిచివేసింది. గుర్తుతెలియని వ్యక్తులు వృద్దురాలిని వదిలి పెట్టి వెళ్లడంతో స్థానికులు పాతగుంటూరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో గుంటూరు కోవిడ్ ఫైటర్స్ టీమ్ ఆ వృద్దురాలికి సపర్యలు చేసి పొన్నూరు గోతాలస్వామి ఆశ్రమంలో చేర్పించి మానవత్వం చాటుకున్నారు.
News September 8, 2025
Way2News ఎఫెక్ట్.. దుర్గగుడికి వైద్యుల కేటాయింపు

ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయంలో వైద్యులు లేకపోవడంపై Way2Newsలో కథనం ప్రచురితమైంది. ఈ విషయంపై DMHO సుహాసిని స్పందించారు. సోమవారం ఇద్దరు వైద్యులను దుర్గగుడికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తపేట ఏరియాలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సురేశ్ బాబు, కృష్ణలంకలో పనిచేస్తున్న డాక్టర్ ఉదయ్ కృష్ణలను డిప్యూటేషన్‌పై దుర్గగుడిలో పనిచేయాలని ఆదేశాలు అందాయి. దీంతో భక్తులు, ఆలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
News September 8, 2025
CBI పేరుతో రూ.62.25 లక్షలు ఫ్రాడ్

గుంటూరు భారతపేట ప్రాంతానికి చెందిన ఓ కన్‌స్ట్రక్షన్ వ్యాపారం చేసే వ్యక్తికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సీబీఐ పేరుతో రూ.62.25 లక్షలు టోకరా వేశారు. సీబీఐ నుంచి మాట్లాడుతున్నామని, మనీ లాండరింగ్ కేసులో అరెస్టు చేస్తామని బెదిరించారు. అరెస్టు చేయకుండా ఉండాలంటే క్లియరెన్స్ కోసం రూ.62.25 లక్షలు కట్టాలనడంతో నగదు చెల్లించాడు. అయినా కూడా ఫోన్లు చేసి బెదిరిస్తూనే ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.