News August 12, 2025

పోలీసులు అప్రమత్తంగా ఉండాలి: వరంగల్ సీపీ

image

వరంగల్ ట్రై సిటీతో పాటు పోలీస్ కమిషనరేట్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి నుంచి భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీపీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశించారు. ముఖ్యంగా పోలీస్ అధికారులు లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. చెరువులు, కుంటల సమీపంలో ఉండే ప్రజలను అప్రమత్తం చేయడంతో ట్రాఫిక్ సమస్య రాకుండా స్పందించాలని సూచించారు.

Similar News

News April 19, 2026

నల్గొండ: రైలు కింద పడి మహిళ ఆత్మహత్య

image

రైలు కింద పడి ఓ గుర్తుతెలియని మహిళ(55) ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం రాత్రి చిట్యాల – శ్రీరాంపురం మధ్య గోపలాయపల్లి వద్ద చోటుచేసుకుంది. సికింద్రాబాద్ – హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ కింద పడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్టేషన్ మాస్టర్ అభినవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్లగొండ రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. మృతురాలి ఆచూకీ తెలిసిన వారు 87126 58595 నంబర్‌కు సమాచారం అందించాలని ఎస్‌ఐ కోరారు.

News April 19, 2026

అప్పులపై రాజధాని.. అలాగే మావిగన్ సరికాదు: విజయసాయిరెడ్డి

image

AP: రాష్ట్రానికి క్రమశిక్షణ కలిగిన రాజధాని అవసరమని YCP మాజీ MP విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. ‘రూ.లక్షల కోట్లతో అమరావతి ప్రణాళిక ఉంది. అప్పులపై రాజధాని నమూనా సరికాదు. ఏకీకృత, దశలవారీ అభివృద్ధితో నిర్మించాలి. రైతులకిచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైంది. రాజధాని అనేది పరిపాలనకు నాడీ‌కేంద్రంగా ఉండాలి. మావిగన్ అంటూ పరిపాలనా విభజన ప్రమాదం. దీంతో పెట్టుబడిదారుల్లో అనిశ్చితి నెలకొంటుంది’ అని అన్నారు.

News April 19, 2026

VKB: మహిళలకు ఫ్రీ బ్యూటీషియన్ శిక్షణ

image

చిల్కూరులోని SBI- RSETI ఆధ్వర్యంలో గ్రామీణ మహిళలకు ఈ నెల 24 నుంచి ఉచిత బ్యూటీషియన్ శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ మహ్మద్ అలీ తెలిపారు. 18- 45 ఏళ్ల మధ్య వయసు గల యువతులు, మహిళలు అర్హులు. ఆధార్‌కార్డ్, రేషన్‌కార్డ్, 10th మెమోతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణ కాలంలో ఉచితంగా భోజన, వసతి సౌకర్యాలు ఉంటాయన్నారు. మరిన్ని వివరాలకు 79819 51167 నంబరును సంప్రదించగలరు.