News August 12, 2025
అదృశ్యమైన బాలుడు సూసైడ్

మూడు రోజుల క్రితం <<17361238>>అదృశ్యమైన<<>> గుమ్మగట్ట మండలం శిరిగేదొడ్డికి చెందిన కైలాస్ అనే 17 ఏళ్ల బాలుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం సమీపంలో విప్రమలై లక్ష్మీనరసింహస్వామి కొండకు శనివారం వెళ్లి తిరిగి రాలేదు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆలయం సమీప కొండలో మంగళవారం ఉదయం దుర్వాసన రావడంతో స్థానికులు వెళ్లి చూశారు. చెట్టుకు వేలాడుతూ కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు.
Similar News
News August 14, 2025
రెవెన్యూ సమస్యలను త్వరగా పరిష్కరించండి: ఇన్‌ఛార్జి కలెక్టర్

రెవెన్యూ సమస్యలను వేగంగా పరిష్కరించాలని అనంతపురం ఇన్‌ఛార్జి జిల్లా కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఆర్డీవోలు, తహశీల్దార్లు, రీసర్వే డీటీలు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష నిర్వహించారు. సమస్యల పరిష్కారంలో RDO, MRO, డిప్యూటీ MRO బాధ్యతగా పనిచేసి, కిందిస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
News August 13, 2025
వచ్చే 2 రోజుల పాటు వర్ష సూచన

అధిక వర్షాల కారణంగా రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త విజయ్ శంకర్ బాబు తెలిపారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా వచ్చే రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉందదని అన్నారు. వివిధ రకాల పంటలు సాగు చేసిన రైతులు పంట పొలాలపై శ్రద్ధ వహించి అప్రమత్తంగా ఉండాలన్నారు. చీడపీడలు సంభవిస్తే సంబంధిత అధికారులు లేదా శాస్త్రవేత్తలను సంప్రదించాలన్నారు.
News August 11, 2025
ఈనెల 14న మాజీ సీఎం జగన్ అనంతపురానికి రాక

మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈనెల 14న అనంతపురం రానున్నారు. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి కుమారుడి వివాహానికి హాజరు కానున్నారు. ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా హెలిప్యాడ్, బారికేడ్లు తదితర ఏర్పాట్లను విశ్వేశ్వర రెడ్డితో కలిసి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పరిశీలిస్తున్నారు.