News August 12, 2025

కోడేర్‌లో 73.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో గడచిన 24 గంటలలో నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు మంగళవారం ప్రకటించారు. జిల్లాలోనే అత్యధికంగా 73.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. పెద్దకొత్తపల్లి మండలంలో 54.6, కల్వకుర్తిలో 43.2, అచ్చంపేటలో 36.0, కొల్లాపూర్‌లో 20.4, ఊరుకొండలో 27.4, అమ్రాబాద్‌లో 22.4 మిల్లీమీటర్ల ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొన్నారు.

Similar News

News April 19, 2026

ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలి: కలెక్టర్

image

ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లపై వివిధ శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైస్ మిల్లర్ల నుంచి ప్రభుత్వ నిబంధనల ప్రకారం బ్యాంక్ గ్యారంటీ తీసుకోవాలని అధికారులకు సూచించారు.

News April 19, 2026

భీమేశ్వర సన్నిధిలో సినీ హీరోయిన్ అనన్య

image

వేములవాడలోని ప్రసిద్ధ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామిని సినీ హీరోయిన్ అనన్య నాగళ్ల శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందజేశారు. దేవస్థానం డీఈవో భాస్కర శర్మ ఆమెకు ప్రసాదం అందజేశారు.

News April 19, 2026

RCBకి శాపంగా గ్రీన్ జెర్సీ!

image

ఆర్సీబీకి మరోసారి గ్రీన్ జెర్సీ కలిసి రాలేదు. పర్యావరణ పరిరక్షణ కోసం 2011 సీజన్ నుంచి బెంగళూరు ప్లేయర్లు ఒక్కో మ్యాచులో ఈ గ్రీన్ కలర్ జెర్సీ ధరిస్తున్నారు. ఇప్పటివరకు ఈ జెర్సీలో 15 మ్యాచులు ఆడగా అందులో తొమ్మిదింట్లో (ఇవాళ ఢిల్లీతో కలిపి) ఓడింది. ఇక చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఆడిన తొలి, 50వ, 100వ మ్యాచుల్లో ఓటమిపాలు కావడం గమనార్హం.